IPL 2020: మన తెలుగు టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్: కరోనా మహమ్మారి పుణ్యమా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధతకు తెరదించుతూ బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్ షెడ్యూల్‌నే ప్రకటించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ త్వరలోనే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలను కూడా వెల్లడిస్తామని పేర్కొంది.
ఇక మన తెలుగు రాష్ట్రాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ దుబాయ్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ సీజన్‌లో జట్టును డేవిడ్ వార్నర్ నడిపించనుండగా.. ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఈ విధ్వంసకర ఓపెనర్ ఆ సిరీస్ అనంతరం నేరుగా దుబాయ్ రానున్నాడు. క్వారంటైన్ నిబంధనల ప్రకారం 6 రోజుల తర్వాత జట్టుతో కలవనున్నాడు. అయితే వార్నర్ గైర్హాజరీలో జట్టును నడిపించేది ఎవరని ఫ్రాంచైజీ ప్రకటించకపోయినా.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారథ్యం వహించే అవకాశం ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆర్‌సీబీతో సెప్టెంబర్ 21న తొలి మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్.. నవంబర్ 3న ముంబై ఇండియన్స్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. 'మన షెడ్యూల్' ఇదే అంటూ సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications