Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ‘గచ్చిబౌలి దివాకర్’!

Sunrisers Hyderabad Chose Gachibowli Diwakar before IPL 2021 auction
IPL 2021: Sunrisers Hyderabad Chose Gachibowli Diwakar before IPL 2021 Auction

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్)2021 సీజన్‌కు ఇంకా సమయమున్నా.. ఫ్రాంచైజీల హడావుడి మాత్రం అప్పుడే మొదలైంది. 15 రోజుల క్రితమే తదుపరి సీజన్ కోసం నిర్వహించే మినీ వేలం కోసం జట్లన్నీ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించాయి. జట్టుకు పనికొచ్చే ఆటగాళ్లను ఉంచుకొని.. పనికిరానివారిని నిర్మోహమాటంగా వదులుకున్నాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న మినీ వేలం నిర్వహిస్తామని ప్రకటించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. తమ లెక్కలకు సరిపోయే ఆటగాళ్ల కోసం పాచికలు కదుపుతున్నాయి.

బ్రహ్మీ అలియాస్ గచ్చిబౌలి దివాకర్..

బ్రహ్మీ అలియాస్ గచ్చిబౌలి దివాకర్..

ఈ క్రమంలోనే అభిమానులను ఆకట్టుకునేందుకు ఫ్రాంచైజీల సోషల్‌ మీడియా వేదికగా వినూత్న పోస్టులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌ రాయల్స్‌ ఓ నలుగురి ఫొటోలను ట్వీట్ చేసి ఇందులో ఎవరినైనా ఎంచుకోవాలని క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ ట్వీట్‌లో లగాన్‌ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌, తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా నటుడు దిలీప్‌ జోషి (జెఠాలాల్‌) మరో ఇద్దరు సినిమా క్రికెటర్లు ఉన్నారు. అయితే ఈ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తనదైన శైలిలో బదులిచ్చింది. 'మేం మా క్రికెటర్‌ను ఎంపిక చేసుకున్నాం' అంటూ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం జిఫ్‌ ఫైల్‌ను పోస్ట్‌ చేసింది.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలోని..

'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో గచ్చిబౌలి దివాకర్‌గా బ్రహ్మీ నటనకు అభిమానులు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలోని ఫైల్‌నే షేర్ చేసిన సన్‌రైజర్స్.. మా జట్టులోకి గచ్చి బౌలి దివాకర్‌ను తీసుకున్నామని చెప్పకనే చెప్పి రాజస్థాన్‌కు పంచ్ ఇచ్చింది. సన్‌రైజర్స్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇతర సినిమాల్లో కూడా బ్రహ్మానందం క్రికెటర్‌గా ప్రేక్షకులను నవ్వించిన విషయం తెలిసిందే.

తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్

తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్

మినీ వేలం కోసం మిగతా జట్లకు భిన్నంగా 22 మందిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్.. కేవలం ఐదుగురి ప్లేయర్లనే వదిలేసుకుంది. ఈ ఐదుగురిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బావనక సందీప్, యర్ర పృథ్వీ రాజ్‌ను రిలీజ్ చేసింది. హైదరాబాద్‌‌లోని రామ్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల బావనక సందీప్‌ను గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అతనికి ఒక్క అవకాశం కూడా రాలేదు. అతను పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. భువనేశ్వర్ గాయంతో అర్థాంతరంగా తప్పుకోవడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన యర్ర పృథ్వీ రాజ్‌‌కు కూడా మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. భువీ రాకతో అతను ఉద్వాసనకు గురయ్యాడు.

ఆరెంజ్ రిటెన్షన్ లిస్ట్..

ఆరెంజ్ రిటెన్షన్ లిస్ట్..

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, నటరాజన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమాద్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి, షాబాజ్ నదీమ్, సిద్దార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్

వదులుకున్న ఆటగాళ్లు: బిల్లీ స్టాన్​లేక్, ఫాబియాన్ అలెన్, ఎస్ యాదవ్, బావనక సందీప్, యర్ర పృథ్వీరాజ్

Story first published: Wednesday, February 3, 2021, 18:04 [IST]
Other articles published on Feb 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+