న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ 11లోనే హైదరాబాద్ జట్టు తొలిసారి, ఆరంభంలో తడబడ్డ చెన్నై

Sunrisers Hyderabad build team with solid all-round strength; Kings XI Punjab look lopsided

హైదరాబాద్: ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొంటున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు సీజన్లలో దిగ్గజ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, డేవిడ్‌ వార్నర్‌లు లేకుండా తొలిసారి బరిలోకి దిగింది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ ఆటగాడి గైర్హాజరుతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో సగం బలం కోల్పోయింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో​ ఈ సీజన్‌ తొలి మూడు మ్యాచుల్లో బ్యాటింగ్‌ బాధ్యతలను ఎత్తుకున్నధావన్‌ అనూహ్యంగా పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో గాయపడ్డాడు. సన్‌రైజర్స్‌ ఆ మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకొని తొలి ఓటమిని చవిచూసింది. ఇక ధావన్‌ ప్రస్తుత చెన్నై మ్యాచ్‌కు కూడా కోలుకోకపోవడంతో అతని స్థానంలో యువ ఆటగాడు రికీభుయ్‌ అరంగేట్రం చేశాడు. 2013 నుంచి శిఖర్‌ ధావన్‌, వార్నర్‌ల్లో ఏ ఒక్క ఆటగాడు లేకుండా సన్‌రైజర్స్‌ బరిలోకి దిగలేదు.

ఈ దిగ్గజ ఆటగాళ్లు లేకుండా సన్‌రైజర్స్‌ బరిలోకి దిగడానికి తాజా ఉప్పల్ వేదికైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చెత్త రికార్డు నమోదు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల అద్బుత బౌలింగ్‌కు ఈ సీజన్‌లో తొలి పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన చెన్నై జట్టు సన్‌రైజర్స్‌ పటిష్ట బౌలింగ్‌ ముందు తేలిపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోని సేన పవర్‌ ప్లే(ఆరు ఓవర్లు) ముగిసే సరికి వికెట్‌ నష్టపోయి 27 పరుగులే చేసింది. దీంతో ఈ సీజన్‌లో పవర్‌ప్లే ముగిసే సరికి అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన తొలి జట్టుగా చెన్నై అప్రతిష్టను మూటగట్టుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు భువనేశ్వర్‌, బిల్లిస్టేన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌, సిద్దార్థ్‌ కౌల్‌ల కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల కోసం చెన్నై బ్యాట్స్‌మన్‌లు తెగ ఇబ్బంది పడుతున్నారు.

Story first published: Sunday, April 22, 2018, 17:56 [IST]
Other articles published on Apr 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X