ఒక్క సిక్సు లేకుండా: ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డు

Posted By:
Sunrisers Hyderabad beat Rajasthan Royals by 9 wickets

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసి భారీగా పరుగులు చేయకుండా సన్‌రైజర్స్ బౌలర్లు నియంత్రించారు. సన్‌ రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్ధ్‌ కౌల్‌, షకిబ్ ఉల్ హసన్‌ చెరో రెండు వికెట్ల తీయగా, భువీ, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

ఐదుగురు బౌలర్లూ 30 పరుగులు మించకుండా బౌలింగ్‌

ఐదుగురు బౌలర్లూ 30 పరుగులు మించకుండా బౌలింగ్‌

అయితే సన్‌‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగాన్ని పంచుకున్న ఐదుగురు బౌలర్లూ 30 పరుగులు మించకుండా బౌలింగ్‌ వేయడం విశేషం. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

టాప్ స్కోరర్‌గా సంజూ శాంసన్

టాప్ స్కోరర్‌గా సంజూ శాంసన్

రాజస్థాన్ తరఫున సంజూ శాంసన్ (49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులు విసరడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడలేకపోయారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆటగాళ్లు అందరూ కలిసి 12 ఫోర్లు మాత్రమే బాదగలిగారు.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేదు

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేదు

దీంతో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్‌లో సిక్స్‌లు లేకుండా ఓ జట్టు ఇన్నింగ్స్ ముగించడం ఇది 11వ సారి కాగా, రాజస్థాన్ రాయల్స్‌కు నాలుగోసారి. ఐపీఎల్‌లో సిక్స్‌లు లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

సిక్స్ లేకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్‌రైజర్స్

సిక్స్ లేకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్‌రైజర్స్

ఇదిలా ఉంటే ఒక్క సిక్స్ కూడా బాదకుండా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. గతంలో గుజరాత్ లయన్స్‌పై ఒక్క సిక్స్ కూడా బాదకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 158 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు 23 ఫోర్లు బాదారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 0:09 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి