Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా ఆర్‌సీబీ మాజీ పేసర్

ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సమయాత్తమవుతోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో జట్టు ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బౌలింగ్ కో‌చ్‌ను మార్చింది. జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను తప్పించి కొత్త బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ వరుణ్ ఆరోన్‌ను నియమించింది. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

'మా కోచింగ్ విభాగానికి ఆజ్యం తోడైంది. మా కొత్త బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరో‌న్‌కు స్వాగతం'అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. జార్ఖండ్‌కు చెందిన వరుణ్ ఆరోన్..అత్యంత వేగవంతమైన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 2011-2015 మధ్య భారత్ తరఫున 9 వన్డేలు, 9 టెస్ట్‌లు ఆడిన వరుణ్ ఆరోన్..29 వికెట్లు తీసాడు. వేగం అతని ప్రధాన బలం అయినప్పటికీ, తరచుగా గాయాల బారిన పడటం వరుణ్ ఆరోన్ కెరీర్‌పై ప్రభావం చూపింది.

Sunrisers Hyderabad Appoint Former India Pacer Varun Aaron as Bowling Coach Ahead of IPL 2026

ఐపీఎల్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ ఆరోన్ 8.94 ఎనానమీతో 44 వికెట్లు పడగొట్టాడు. 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన వరుణ్ అరోన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2014-2016), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) (2017), రాజస్థాన్ రాయల్స్ (2019-2020), గుజరాత్ టైటాన్స్ (2022) జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన అతను కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఎమ్‌ఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో యువ పేసర్లకు వరుణ్ ఆరోన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇది తప్పా కోచ్‌గా అతనికి ఎలాంటి అనుభవం లేదు.

వరుణ్ ఆరోన్ నియామకంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సరైన ఎంపిక అంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. బౌలర్‌గానే వరుణ్ ఆరోన్ రాణించలేదని, కోచ్‌గా ఏం చేస్తాడని కొందరు విమర్శించగా.. ఇండియన్ కోచ్‌ను తీసుకోవడం మంచి నిర్ణయమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా డానియల్ వెటోరి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2025 సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

Story first published: Monday, July 14, 2025, 17:26 [IST]
Other articles published on Jul 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+