For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. కీరన్ పోలార్డ్ రికార్డ్ బద్దలు!

కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఓవర్‌సీస్ ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌తో సునీల్ నరైన్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన అజింక్యా రహానే.. తమ ఓవర్‌సీస్ ఆటగాళ్ల జాబితాలో సునీల్ నరైన్ ఉన్నాడని చెప్పాడు.

సునీల్ నరైన్‌కు ఇది 190వ ఐపీఎల్ మ్యాచ్‌. ఈ క్రమంలో అతను ముంబై ఇండియన్స్ మాజీ ఆల్‌రౌండర్, సహచర విండీస్ ప్లేయర్ కీరన్ పోలార్డ్‌ను అధిగమించాడు. పొలార్డ్ 189 మ్యాచ్‌లు ఆడి ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఓవర్‌సీస్ ఆటగాళ్లలో సునీల్ నరైన్(190) తర్వాత కీరన్ పొలార్డ్(189), ఏబీ డివిలియర్స్(184), డేవిడ్ వార్నర్(184), డ్వేన్ బ్రావో(161) ఉన్నారు.

Sunil Narine Makes History Breaks Kieron Pollard s Record for Most T20 Appearances for One Team

ఎప్పుడూ ఓపెనర్‌గా బరిలోకి దిగే సునీల్ నరైన్ ఈ సీజన్‌లో మాత్రం బౌలింగ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67),అంగ్‌క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫిన్ అలెన్(17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), రింకూ సింగ్(21 బంతుల్లో 4 ఫోర్లతో 33 నాటౌట్) దూకుడుగా ఆడారు. ముంబై బౌలరల్లో శార్దూల్ ఠాకూర్(3/35) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసాడు.

Story first published: Sunday, March 29, 2026, 21:14 [IST]
Other articles published on Mar 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+