For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ కెప్టెన్సీపై వేటు.. అభిమానులకు హెచ్చరిక: సునీల్ గవాస్కర్

వన్డే ప్రపంచకప్ 2027 ఆడే విషయంపై క్లారిటీ లేకపోవడంతోనే టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇది సరైన నిర్ణయమేనని చెప్పిన గవాస్కర్.. భవిష్యత్తులో బ్యాడ్ న్యూస్ వినేందుకు అభిమానులు సిద్దంగా ఉండాలని హెచ్చరించాడు. అంతర్జాతీయ వన్డేల షెడ్యూల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే ప్రపంచకప్ 2027 ఆడటం సందేహంగా మారిందని చెప్పాడు.

తాజాగా ఓ జాతీయ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడిన గవాస్కర్.. కోహ్లీ, రోహిత్ వన్డే ప్రపంచకప్ 2025 ఆడాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పాడు. 'వన్డే ప్రపంచకప్‌ 2025 టోర్నీలో రోహిత్ శర్మ ఆడుతాడో లేదో తెలియదు. ప్రస్తుతం అతను వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్యాలెండర్‌ను చూస్తే.. భారత జట్టు ఎక్కువగా వన్డేలు ఆడే అవకాశం లేదు. ద్వైపాక్షిక పర్యటనల్లో ఎక్కువగా టెస్ట్‌లు, టీ20లు ఉన్నాయి.

Sunil Gavaskar Warns Rohit Sharma of More Bad News After BCCI s Captaincy Switch to Shubman Gill

ఏడాదికి 5-7 వన్డేలు మాత్రమే ఆడితే.. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీకి కావాల్సిన ప్రాక్టీస్ లభించదు. జట్టులో అతని స్థానంపై స్పష్టత లేకపోవడంతోనే శుభ్‌మన్ గిల్‌ను సారథిగా సిద్దం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు ఆలోచనే ఇది. వ్యక్తిగతంగా రోహిత్ చాలా సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌ను గెలిపించాడు. అతని కెప్టెన్సీ గురించి మరో ఆలోచన లేదు. కానీ అతను కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే మెగా టోర్నీకి ఓ యువ సారథిని సిద్దం చేయడం కీలకం. సెలెక్షన్ కమిటీ ఇదే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది.

కోహ్లీ, రోహిత్ నిబద్దత చూపకపోతే.. వచ్చే రెండేళ్లలో మరిన్ని బ్యాడ్ న్యూస్ వినేందుకు సిద్దంగా ఉండాలి. కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగాలంటే కోహ్లీ, రోహిత్ విజయ్ హజారే ట్రోఫీని ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు వన్డే ప్రపంచకప్ 2027 ఆడే విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, October 6, 2025, 15:23 [IST]
Other articles published on Oct 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+