అగార్కర్ వారసుడికి గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకుంటుంది. దీంతో బీసీసీఐ ఆయన వారసుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించి త్వరలోనే కొత్త చీఫ్ సెలెక్టర్ పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కొత్తగా బాధ్యతలు చేపట్టే ప్రధాన సెలెక్టర్‌కు ముందస్తుగా కొన్ని కీలక సూచనలు, హెచ్చరికలు చేశారు.
'ఒకే ఒక్క తప్పు గుర్తొస్తుంది'- గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
ప్రధాన సెలెక్టర్ పదవి ఎంతటి ప్రతిష్టాత్మకమైనదో, అంతకంటే ఎక్కువ సవాళ్లతో కూడుకున్నదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మిడ్-డే పత్రికలో రాసిన తన కాలమ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓ సెలెక్టర్ చేసిన అనేక మంచి నిర్ణయాలను అందరూ మర్చిపోతారని, కానీ ఏదైనా ఓ తప్పు జరిగితే మాత్రం దానినే పదేపదే ఎత్తిచూపుతారని వెల్లడించారు. అంపైరింగ్, వికెట్ కీపింగ్, కామెంటరీల మాదిరిగానే సెలెక్టర్ల విషయంలో కూడా మంచి పనులు వెనక్కి వెళ్లి, ఒకే ఒక్క పొరపాటు పెద్ద వివాదాంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

మీడియా ముందుకు ఛైర్మన్ మాత్రమే రావడంపై సవాలు
సెలక్షన్ కమిటీలో నిర్ణయ ప్రక్రియ గురించి సునీల్ గవాస్కర్ మరింత స్పష్టతనిచ్చారు. ఓ నిర్ణయం కేవలం ఛైర్మన్ ఒక్కరిదే కాదని, ఇతర సెలక్టర్లు కూడా అందులో భాగస్వాములే అని చెప్పారు. కానీ బాహ్య ప్రపంచానికి, మీడియాకు కేవలం ఛైర్మన్ మాత్రమే సమాధానం చెప్పాల్సి వస్తుందని, దీంతో విమర్శలన్నీ ఛైర్మన్ ఒక్కడే ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. మిగిలిన సెలెక్టర్ల పాత్ర తెరవెనుక ఉండిపోవడంతో ఛైర్మన్ పదవి ప్రతి నిర్ణయంలోనూ ఓ పెద్ద సవాలుగా మారుతుందన్నారు.
అజిత్ అగార్కర్ హయాంలో భారత్ విజయాలు
అజిత్ అగార్కర్ 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత క్రికెట్ జట్టు అనేక విజయాలను సాధించింది. ఆయన హయాంలో టీమిండియా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచ కప్ వంటి ప్రధాన టోర్నమెంట్లలో టైటిళ్లను గెలుచుకుంది. సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు, యువ ఆటగాళ్లకు అవకాశాల మధ్య సమతుల్యత పాటిస్తూ అగార్కర్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
కొత్త చీఫ్ సెలెక్టర్ ముందున్న భారీ షెడ్యూల్
రాబోయే రోజుల్లో కొత్తగా రాబోయే చీఫ్ సెలెక్టర్‌కు పనిభారం, బాధ్యతలు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. టీమిండియా రాబోయే న్యూజిలాండ్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అదనంగా 2027 వన్జే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ జట్టు కూర్పును రూపొందించడం, యువ ఆటగాళ్లను సిద్ధం చేయడం కొత్త సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌కు ప్రాథమిక లక్ష్యంగా మారనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


