Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకప్పుడు సచిన్ కూడా అంతే.. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా కొనసాగించాలి: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar wants Virat Kohli to continue opening the innings for Team India
Ind vs Eng 5th T20I: #SunilGavaskar Wants #RohitSharma, #ViratKohli To Open For India In T20 Cricket

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా కొనసాగించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగులతో తేడాతో గెలిచి 5 టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్‌) దుమ్మురేపాడు.

రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ భారీ స్కోర్ చేయడం కీలక పాత్ర పోషించాడు. దాంతో విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది.

ఓపెనర్‌గా కొనసాగాలి..

ఓపెనర్‌గా కొనసాగాలి..

ఈ నేపథ్యంలో ఇండియాటుడేతో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. విరాట్-రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీని కొనసాగించాలన్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా మిడిలక ఆర్డర్‌లో ఆడేవాడని, ఓపెనింగ్‌కు వచ్చాక భారత జట్టు రూపురేఖలే మారిపోయాయని ఈ లిటిల్ మాస్టర్ గుర్తు చేశాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అధిక ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాలి. విరాట్‌ కోహ్లీ కూడా ఇలాగే ఓపెనర్‌గా కొనసాగాలి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ లేకపోవడం..

రాహుల్ లేకపోవడం..

రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం ఒక విధంగా టీమిండియాకు కలిసొచ్చిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'రాహుల్ ఫామ్ కోల్పోవడం భారత జట్టుకు కలిసొచ్చింది. ఎందుకంటే ఈ కొత్త జోడీ(రోహిత్-కోహ్లీ) భవిష్యత్‌పై ఆశలు పెట్టుకునేలా చేసింది. సచిన్‌ కూడా మొదట్లో మిడిల్‌ఆర్డర్‌లో ఆడేవాడు. అతడిని ఓపెనింగ్‌లో పంపించగానే టీమ్‌ఇండియా రూపురేఖలే మారిపోయాయి. అది అతడి వ్యక్తిగత ప్రదర్శన మీదే కాకుండా జట్టు మొత్తంపైనే ప్రభావం చూపింది. కాబట్టి, బాగా ఆడేవారిని ముందుగా బ్యాటింగ్‌కు పంపాలి. రోహిత్‌, కోహ్లీ జోడీని ఇలాగే కొనసాగించాలి' అని గవాస్కర్‌ పేర్కొన్నాడు.

కోహ్లీ కూడా...

కోహ్లీ కూడా...

ఇక, రాహుల్‌ ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నుంచి ఆడినా పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టీ20లో ఒక్క పరుగు చేసిన అతను తర్వాత 0, 0, 14 పరుగులు చేశాడు. దీంతో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న అతన్ని టీమిండియా చివరి మ్యాచ్‌లో పక్కకుపెట్టింది. ఈ క్రమంలోనే రోహిత్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్‌ చేశాడు. దాంతో వారిద్దరూ ఇంగ్లండ్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఈ కొత్త ప్రయోగం బాగా పనిచేయడంతో కోహ్లీ సైతం రోహిత్‌తో మళ్లీ ఓపెనింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు. దీంతో అభిమానులు సైతం భవిష్యత్‌లో వీరిద్దరూ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నారు.

Story first published: Sunday, March 21, 2021, 15:58 [IST]
Other articles published on Mar 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+