
ఏడుసార్లు ఔటయ్యాడు
ఐదు టెస్ట్ మ్యాచుల సీరీసులో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పేలవంగా ఆడుతోంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరడంతో కేవలం 78 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఈ మ్యాచులోనైనా భారీ స్కోరు చేస్తాడని ఆశించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 7 పరుగులే చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
టెస్టు కెరీర్లో అతడు జిమ్మీకి వికెట్ ఇవ్వడం ఇది ఏడోసారి. గతంలో నాథన్ లైయన్ బౌలింగ్‌లోనూ విరాట్ ఏడుసార్లు ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్ నాలుగు, ఐదో స్టంప్‌లైన్‌లో వెళ్తున్న బంతులకు అతడు ఔటవుతుండటం గమనార్హం. గత పర్యటనలో పరుగుల వరద పారించిన కోహ్లీ.. ఈసారి మాత్రం విఫలమవుతున్నాడు.

కోహ్లీ.. సచిన్‌కు ఫోన్ చేయి
మూడో టెస్టు తొలి రోజు తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు. 'విరాట్ కోహ్లీ వెంటనే సచిన్ టెండూల్కర్‌కు ఫోన్ చేయాలి. ఏం చేస్తే మంచిదో అతడిని అడగాలి. నాకిది ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే విరాట్ ఐదు, ఆరు, ఏడో స్టంప్‌లైన్ బంతులకు ఔటవుతున్నాడు. 2014లో అతడు కేవలం ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లే బంతులకు మాత్రమే ఔటయ్యేవాడు' అని అన్నాడు.
2003-04లో సిడ్నీ టెస్టులో సచిన్ అనుసరించిన విధానాన్నే కోహ్లీ పాటిస్తే మేలన్నాడు. 'సిడ్నీ టెస్టులో సచిన్ ఏం చేశాడో విరాట్ దానినే అనుసరిస్తే మంచిది. నేనిక కవర్‌డ్రైవ్ ఆడబోను అని తనకు తానే చెప్పుకోవాలి' అని సన్నీ పేర్కొన్నాడు. ఔట్ స్వింగయ్యే బంతులకు బహుశా ఇలా చేయడమే మంచిదని అభిమానులూ కూడా కోరుకుంటున్నారు.

ఇప్పటికే 50 ఇన్నింగ్స్‌లు
ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేయక ఇప్పటికి 50 ఇన్నింగ్స్‌లు ముగిసాయి. లీడ్స్ వేదికగా ఈరోజు ఆరంభం అయిన తొలి ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ శతకం అందుకోక 50 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యాయి. మూడు ఫార్మాట్‌లలో కలిపి 50 ఇన్నింగ్స్‌లు ముగిసాయి.
18 టెస్ట్ ఇన్నింగ్స్‌లు, 15 వన్డే ఇన్నింగ్స్‌లు, 17 టీ20 ఇన్నింగ్స్‌లు అందులో ఉన్నాయి. దీంతో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 'మూడో టెస్టుతో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అరరే.. ఎన్నిరోజులాయే. హాఫ్ సెంచరీ చేయక' అని ఇంకొకరు కామెంట్ చేశారు.
India vs England: చతేశ్వర్ పుజారాకు టెక్నిక్‌తో పాటు మైండ్ కూడా పోయింది: మైఖేల్ వాన్

2019లో చివరి సెంచరీ
విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను వమ్ము చేస్తూనే ఉన్నాడు. 2008లో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.

70 సెంచరీలు.. 23 వేల పరుగులు
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ (తొలి టెస్ట్ ముందు వరకు) 94 టెస్టులాడి 51.4 సగటుతో 7609 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగులు చేశాడు.

ఓపెనర్లు ఔట్
ఓవర్‌నైట్ స్కోర్ 120/0తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు.. తొలి సెషన్‌లోనే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలుత 135 పరుగుల వద్ద రోరీ బర్న్స్ (61)ను మొహ్మద్ షమీ పెవిలియన్‌కు పంపగా.. 159 పరుగుల వద్ద హసీబ్ హమీద్ (68; 12 ఫోర్లు)ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో డేవిడ్ మలాన్ (18), జో రూట్ (0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 81 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications












