
షాట్లను కూడా మరిచిపోయాడు
తాజాగా మైఖేల్ వాన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'చేతేశ్వర్ పుజారా తన ఆట తీరును పూర్తిగా మరిచిపోయాడు. సముద్రంలో మునిగిన నావలా అన్న చందంగా పుజారా పరిస్థితి తయారైంది. అతనికి మైండ్ పోవడంతో పాటు తన మార్క్ టెక్నిక్ షాట్లను కూడా మరిచిపోయాడు. ఆటలో స్కోరు నమోదు చేయడం కంటే.. మ్యాచ్‌లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ ఒత్తిడిలో కూరుకుపోయి అతను తేలిగ్గా వికెట్ ఇచ్చేస్తున్నాడు' అని అన్నాడు.

11 ఇన్నింగ్స్‌లుగా
2020 నుంచి చూసుకుంటే టెస్టుల్లో చేతేశ్వర్ పుజారా సగటు 25కు తక్కువగా ఉండడం గమనార్హం. ఇక 11 ఇన్నింగ్స్‌ల నుంచి పుజారా అర్థ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో పుజారా హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత వరుసగా 15, 21, 7, 0, 17, 8,15,4,12 నాటౌట్, 9, 45 పరుగులు చేశాడు.
ఇక జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో పుజారాను ఔట్ చేయడం ఇది పదోసారి. అండర్సన్‌తో పాటు నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) కూడా పుజారాను 10 సార్లు ఔట్ చేశాడు. పాట్ కమిన్స్ 7 సార్లు, జోష్ హాజిల్‌వుడ్ 6 సార్లు, ట్రెంట్ బౌల్ట్ 5 సార్లు, జాక్ లీచ్ 4 సార్లు, బెన్ స్టోక్స్ 4 సార్లు, స్టువర్ట్ బ్రాడ్ 4 సార్లు పుజారాను ఔట్ చేశారు.

పుజారాపై ట్రోల్స్
చేతేశ్వర్ పుజారా మరోసారి ఘోరంగా విఫలం కావడం పట్ల నెటిజన్లు అంతే ఘోరంగా అతనిపై నిప్పులు చెరుగుతున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. పుజారా జట్టుకు భారంగా పరిణమించడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక అవసరం లేదని తేల్చి చెబుతోన్నారు. పుజారాను తుది జట్టులోకి ఎలా తీసుకున్నారనడానికి కారణాలను టీమిండియా మేనేజ్‌మెంట్ వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. తుది 11 మందిలో పుజారాకు ఏ ప్రాతిపదికన చోటు కల్పించారని నిలదీస్తోన్నారు. మీమ్స్‌తో ఓ ఆటాడుకుంటున్నారు. అతనికి ఉద్వాసన పలకడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని తేల్చి చెబుతున్నారు.

టాస్ ఏమాత్రం కలిసిరావడం లేదు
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి టాస్ ఏమాత్రం కలిసిరావడం లేదు. విదేశాల్లో టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ టాస్ గెలిస్తే.. భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ టాస్ గెలవగా.. భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో వరుసగా 8 సార్లు ఓడిపోయిన తర్వాత కోహ్లీ మూడో టెస్ట్ మ్యాచులో టాస్ గెలిచాడు. మరోసారి భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నెటిజన్లు కోహ్లీపై సెటైర్లు వేస్తున్నారు. 'కోహ్లీ టాస్ గెలిస్తే అంతేసంగతులు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'విదేశాల్లో విరాట్ టాస్ గెలిస్తే ఫలితం ఇలానే ఉంటది మరి' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా భారత జట్టుపై వ్యంగంగా ఓ ట్వీట్ చేశాడు. 'గుడ్ ఈవెనింగ్ ఇండియా' అంటూ సెటైర్ వేశాడు.


Click it and Unblock the Notifications












