For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్ సెంచరీ.. పిల్లి మొగ్గ వేయమన్న సునీల్ గవాస్కర్!(వీడియో)

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో సెంచరీతో చెలరేగాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ రిషభ్ పంత్ శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో టెస్ట్ క్రికెట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్‌‌గా పంత్ చరిత్రకెక్కాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. పంత్ కన్నా ముందు జింబాబ్వే క్రికెటర్, ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఈ రికార్డ్ అందుకున్నాడు.

సునీల్ గవాస్కర్ ఫిదా..

83 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన పంత్ అనంతరం భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. 104 బంతుల్లోనే 90 పరుగుల మార్క్ అందుకున్నాడు. కానీ సెంచరీ మార్క్ అందుకునేందుకు అతను ఏకంగా 26 బంతులాడాడు. చివరకు షోయబ్ బషీర్ ఓవర్‌లో క్విక్ సింగిల్ తీసి 130 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ పూర్తయిన వెంటనే ఒంటి కన్నుతో సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. రిషభ్ పంత్ సెంచరీకి ఫిదా అయ్యాడు. రిషభ్ పంత్ సెంచరీ సమయంలో గ్యాలరీలోకి వచ్చాడు. పంత్ ట్రేడ్ మార్క్ సెలెబ్రెషన్ అయిన పిల్లి మొగ్గ వేయాలని గవాస్కర్ తన సైగలతో చూపించాడు. దానికి పంత్.. మళ్లీ ఎప్పుడైనా.. అని సైగలు చేశాడు. ఈ ఘటన మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. క్యూట్ రియాక్షన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Sunil Gavaskar Urges Rishabh Pant For Somersault Celebration in IND vs ENG 1st Test Video

స్టుపిడ్ స్టుపిడ్ అంటూ..

ఆసీస్ పర్యటనలో పంత్ వైఫల్యంపై గవాస్కర్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు. స్టుపిడ్ స్టుపిడ్ స్టుపిడ్ అంటూ తిట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ అనంతరం సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ అంటూ కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన రిషభ్ పంత్.. ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ బాది ఫామ్ అందుకున్నాడు. ఆ సమయంలో ఫ్లిప్ కొట్టి సంబరాలు చేసుకున్న పంత్.. ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే తరహా సెలెబ్రేషన్‌ను రిపీట్ చేశాడు. ఈ క్రమంలోనే అది అతని ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్‌గా మారిపోయింది. సాధారణంగా ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్స్ ఇలాంటి సంబరాలు చేసుకుంటారు.

Story first published: Monday, June 23, 2025, 21:58 [IST]
Other articles published on Jun 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+