Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ్యక్తి పూజను పక్కన పెట్టండి.. శ్రీలంకను ఓడించడం అంత ఈజీ కాదు: గవాస్కర్

శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని టీమిండియాను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 15 నుంచి ఈ సిరీస్ మొదలవ్వనుంది. గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయాలి. ఇప్పటి వరకు ఈ సైకిల్‌లో 9 టెస్ట్‌ల్లో 4 గెలిచి మరో 4 ఓడిన భారత్ ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే మిగతా 9 మ్యాచ్‌ల్లో కనీసం ఏడింటిలో గెలుపొందాలి. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోవద్దు.

Sunil Gavaskar Urges India to Put Team Ahead of Individuals Before Sri Lanka Tests

ఈ నేపథ్యంలో టీమిండియాకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. శ్రీలంకను ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. 'శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. సొంత గడ్డపై శ్రీలంకను ఓడించడం చాలా కష్టం. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఈ సిరీస్ గెలవడం అత్యంత కీలకం.

అలాగే క్లీన్ స్వీప్ చేసి కొత్త టెస్ట్ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలి. అలా చేయాలంటే కఠినమైన శ్రమతో పాటు కొంత అదృష్టం కలిసిరావాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఎంతటి గొప్ప స్టార్ అయినా సరే.. వ్యక్తిగతం కంటే జట్టుకే ప్రాధాన్యత ఇవ్వాలి.'అని గవాస్కర్ సూచించాడు.

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసినా పాయింట్స్ టేబుల్‌లో భారత్ స్థానం ఏమాత్రం మెరుగవ్వదు. అదే 0-2తో సిరీస్ కోల్పోతే మాత్రం పాతాళానికి పడిపోతుంది. శ్రీలంక నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. 1-0తో ఓడినా భారత్ స్థానం దిగజారుతోంది. 1-0తో గెలిస్తే విన్నింగ్ పర్సంటేజ్ మెరుగైనా.. ఐదో స్థానంలోనే కొనసాగుతోంది.

Story first published: Thursday, August 13, 2026, 15:26 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+