కోహ్లీ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రోహిత్ ఏం సుద్దపూసనా?: సునీల్ గవాస్కర్

లండన్: నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. భారత జట్టులో పరుగులు చేయకుండా ఉన్నది విరాట్ కోహ్లీ ఒక్కడేనా? అని విమర్శకులను ప్రశ్నించాడు. అసలు కోహ్లీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీసాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడని, ఇతర ఆటగాళ్లు కూడా విఫలమవుతున్నారని వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 43 (టెస్ట్‌లో 31, టీ20ల్లో1, 11) పరుగులే చేశాడు. దాంతో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని కపిల్ దేవ్ వంటి దిగ్గజ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

రోహిత్ వైఫల్యం కనిపించడం లేదా?
ఈ విమర్శలపై తాజాగా స్పోర్ట్స్ తక్ చానెల్‌తో మాట్లాడిన గవాస్కర్.. విమర్శకుల తీరును తప్పుబట్టాడు. 'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లు పరుగులు చేయనప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడరు?. అందరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం టీమిండియా దూకుడు మంత్రాని జపిస్తోంది. ధాటిగా ఆడే క్రమంలో కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమవ్వడం సహజం. అయినా సరైన జట్టును ఎంపిక చేసేందుకు, ఆటగాళ్లపై వేటు వేసేందుకు సరైన సెలెక్షన్ కమిటీ ఉంది. వారు తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు.

అంత తొందర ఎందుకు?
అయినా టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికకు అంత తొందర లేదు. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీలో అత్యుత్తమ జట్లు బరిలోకి దిగుతాయి. ఆసియా కప్ ప్రదర్శన ఆధారంగా భారత సెలెక్టర్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేయవచ్చు. అంతేకాని ఇప్పుడే టీమ్ ఎంపిక విషయంలో తొందరపడాల్సి అవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావచ్చు. ఈ ఫార్మాట్‌లో క్రీజులో సెట్ అయ్యేందుకు అతనికి కావాల్సిన సమయం దొరకనుంది.

వన్డే సిరీస్‌తో ఫామ్‌లోకి..
అలాగే ఇంగ్లండ్ వాతావరణం కారణంగా అక్కడ ఉండే స్వింగ్, అనూహ్య బౌన్స్‌ను కోహ్లీ అర్థం చేసుకోగలడు. ఈ క్రమంలోనే కోహ్లీ ఫామ్ అందుకోవడానికి ఇదే సరైన ఫార్మాట్ అని చెబుతున్నా. టీ20 క్రికెట్‌లో జట్టు దూకుడు మంత్ర జపిస్తుండటంతో విరాట్ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని భావించాడు. అది జట్టుకు ప్రయోజనం చేస్తుందనే దూకుడుగా ఆడాడు. చివరి టీ20లో అతను ఔటైన విధానమే ఈ విషయాన్ని తెలియజేస్తోంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆఖరి టీ20లో విరాట్ వరుస బంతుల్లో 6, 4 బాది మరుసటి బంతికి క్యాచ్ ఔటైన విషయం తెలిసిందే.

కోహ్లీకి గజ్జలో గాయం..
ఫామ్‌లో లేని విరాట్ కోహ్లి గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడి గాయం తీవ్రత ఎంతో ఇంకా తెలియలేదు. ''మూడో టీ20 సందర్భంగా విరాట్‌కు గజ్జల్లో గాయమైంది. విశ్రాంతి అవసరమైన నేపఫథ్యంలో అతడు తొలి వన్డేలో ఆడలేకపోవచ్చు'' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇటీవల వరుస వైఫల్యాలతో కోహ్లి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్, సెహ్వాగ్ వంటి మాజీ ఆటగాళ్లు టీ20 జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నించారు. కోహ్లీ దూరమైతే అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications