For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా?! టీమిండియా మేనేజ్‌మెంట్‌పై గవాస్కర్‌ ఫైర్

Sunil Gavaskar slams Team India management over BCCI granted paternity leave to Virat Kohli

న్యూఢిల్లీ: పితృత్వ సెలవులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే కోహ్లీ ఇండియాకి వచ్చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా అతనికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. దీంతో మిగతా మూడు టెస్టులకు విరాట్ దూరంకానున్నాడు. కోహ్లీకి బీసీసీఐ పితృత్వ సెలవులు ఇవ్వడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. కొందరు కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. మరికొందరు మండిపడుతున్నారు.

గవాస్కర్‌ ఫైర్:

గవాస్కర్‌ ఫైర్:

టీమిండియా మేనేజ్‌మెంట్‌ ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్నదని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ఆరోపించారు. తండ్రి కానున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి పితృత్వ సెలవులు ఇచ్చి.. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన అంశాన్ని బుధవారం ఓ ఇంటర్వ్యూలో సన్నీ ప్రస్తావించారు. అదే యువ బౌలర్‌ టీ నటరాజన్‌ భార్య పాపకు జన్మనిచ్చినా.. నెట్‌ బౌలర్‌గా అతడు ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ చెప్పిందన్నారు. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా అంటూ గవాస్కర్‌ టీమిండియా మేనేజ్‌మెంట్‌పై ఫైర్ అయ్యారు.

ఐపీఎల్ 2020 సమయంలో ప్రసవం:

ఐపీఎల్ 2020 సమయంలో ప్రసవం:

యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్ చివరలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన టీ నటరాజన్‌ భార్య ప్రసవించారు. కానీ అతడ్ని భారత్‌కి పంపని టీమిండియా మేనేజ్‌మెంట్.. యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకి తీసుకెళ్లింది. అక్కడ వన్డే, టీ20 సిరీస్‌లో ఆడించి.. టెస్టు సిరీస్ కోసం నెట్ బౌలర్‌గా అక్కడే కొనసాగిస్తోంది. ఆసీస్ సిరీస్ నేపథ్యంలో జనవరి మూడో వారం వరకూ తన బిడ్డని చూసే అవకాశం నటరాజన్‌కు లేకపోయింది. మరోవైపు విరాట్ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ సెలవులు మంజూరుచేసింది. ఒకే టీమ్‌లో ఉన్న కోహ్లీ, నటరాజన్‌ని వేర్వేరుగా చూడటం టీమిండియా మేనేజ్‌మెంట్‌కే చెల్లిందని సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు.

నటరాజన్‌ బిడ్డని ఇంకా చూడలేదు:

నటరాజన్‌ బిడ్డని ఇంకా చూడలేదు:

స్పోర్ట్‌స్టార్ సమావేశంలో సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ... 'భారత జట్టులో మరో ఆటగాడు రూల్స్ గురించి ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉంటాడు. అయితే అతను కొత్తగా జట్టులోకి వచ్చి ఉండటంతో నోరు మొదపడం లేదు. అతను ఎవరో కాదు.. టీ నటరాజన్. యార్కర్ల స్పెషలిస్ట్. టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా తనకి లభించిన 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'‌ని స్వయంగా నటరాజన్‌కి ఇచ్చాడు. అతడి ప్రతిభకు ఫిదా అయి అలా చేశాడు. నటరాజన్ ఇటీవల తండ్రయ్యాడు. కానీ బిడ్డని ఇంకా చూడలేదు. యూఏఈ నుంచి నేరుగా అతడ్ని ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు' అని అన్నారు.

కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా?:

కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా?:

'నటరాజన్‌ టెస్టు జట్టులో లేకపోయినా.. టీమిండియా మేనేజ్‌మెంట్‌ అతడిని నెట్ బౌలర్‌గా అక్కడే ఉంచుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకి పుట్టబోయే బిడ్డని చూసేందుకు భారత్‌కి వస్తున్నాడు. కానీ పుట్టిన బిడ్డని మొదటిసారి చూసేందుకు నటరాజన్‌ జనవరి మూడో వారం వరకూ ఎదురుచూడాలి. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా?. ఒక్కో ఆటగాడికి ఒక్కో రూల్. ఇదీ ఇండియన్ క్రికెట్. టీమిండియా మేనేజ్‌మెంట్‌ ద్వంద్వ విధానాలను అవలంభిస్తుంది' అని గవాస్కర్ ఫైర్ అయ్యారు. గతంలో స్పిన్నర్‌ ఆర్ అశ్విన్‌ ఒక్క మ్యాచ్‌లో రాణించకపోయినా పక్కన పెట్టారని.. అదే బ్యాట్స్‌మెన్‌ విషయంలో అలా చేశారా అని సన్నీ ప్రశ్నించారు.

ISL 2020 21: చివరలో నిమిషంలో ఇగోర్‌ గోల్‌.. గోవా ఖాతాలో మూడో విజయం!!

Story first published: Thursday, December 24, 2020, 8:48 [IST]
Other articles published on Dec 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+