ఇప్పుడు ఒక్కడు మాట్లాడడు! ఇదే భారత్‌లో జరిగితే దుమ్మెత్తిపోస్తారు: సునీల్ గవాస్కర్
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ రెండు రోజుల్లో ముగియడంపై సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. భారత్‌లోనే ఇలా జరిగి ఉంటే దుమ్మెత్తిపోసేవారని, కానీ ఇప్పుడు ఒక్కడు కూడా మాట్లాడడని ఓ న్యూస్ పేపర్‌కు రాసిన కాలమ్‌లో అసహనం వ్యక్తం చేశాడు.
మకే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం 100 పరుగులు చేయలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కామెరూన్ గ్రీన్(67) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిన నాలుగో టెస్ట్‌గా ఇది నిలిచింది.
ఒక్కడ మాట్లాడలేదు..
ఈ మ్యాచ్ ఫలితంపై తన కాలమ్‌లో ప్రస్తావించిన గవాస్కర్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల ద్వంద వైఖరిని ఎండగట్టాడు. 'ఆస్ట్రేలియాలో మరో టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. గత కొన్నేళ్లలో అక్కడ ఇలా జరగడం ఇది నాలుగోసారి. అయినా ఈ వికెట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి విమర్శలు రాలేదు. ఈ పిచ్‌కు వాళ్లు అనేక సాకులు చెబుతారు.

గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరెటర్ వాతావరణాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని, ఎక్కువ వేడి ఉంటుందేమోనని ఊహించి పిచ్‌పై కాస్త ఎక్కువ గడ్డి ఉంచేసారని చెబుతారు. అదే అధిక బౌన్స్‌కు దారి తీసిందని సర్దిచెప్పుకుంటారు. లేదంటే బ్యాటర్లకే అలాంటి బౌన్స్ ఆడే టెక్నిక్ లేదని, పిచ్ తప్పు కాదనే సాకును కూడా వెతుక్కుంటారు. వారి సొంత బ్యాటర్లు బాగా బ్యాటింగ్ చేసి ఉంటే ఈ సాకును నమ్మవచ్చు. కానీ వారు కూడా ఒక్క మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయినప్పుడు.. ఆ పిచ్ ఎలాంటిదో అర్థమవుతూనే ఉంది కదా..?
తొలి టెస్ట్ ఓటమితోనే..
మకే పిచ్ ఏం ఆశ్చర్యం కలిగించలేదు. తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయం తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి బౌన్స్ ఎక్కువ ఉండే, పేస్‌కు అనుకూలించే వికెట్‌ను సిద్దం చేస్తారని తెలిసిందే. కానీ గ్రౌండ్స్‌మెన్ అలా చేశారని, టీమ్‌మేనేజ్‌మెంట్ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తప్పించుకుంటారు.
కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ తమ బౌలింగ్ బలానికి తగ్గట్టుగా పిచ్‌లు కావాలని బహిరంగంగా కోరుకుంటుంది. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటీ టీమ్స్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమకు కావాల్సిన పిచ్‌లను తయారు చేయించుకుంటాయి. మకే పిచ్‌పై మ్యాచ్ రిఫరీ ఇచ్చే రిపోర్ట్, రేటింగ్ ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
భారత్‌లో అయితే దుమ్మెత్తి పోస్తారు..
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల మీడియా నుంచి మార్కులు పొందాలనే తాపత్రయం రెఫరీల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటీవల ఇలా ముగిసిన పిచ్‌లకు ఎలాంటి వ్యతిరేక రేటింగ్ ఇవ్వనట్లే.. ఈ మకే పిచ్‌పై కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేయకపోవచ్చు. కానీ భారత్‌లో ఏదైనా మ్యాచ్ మూడు రోజుల్లో ముగిస్తే మాత్రం పిచ్‌లు, బీసీసీఐ, భారత క్రికెట్‌పై దుమ్మెత్తిపోస్తారు. ఈ పక్షపాతం, దగాకోరుతనం ఎంత బహిరంగంగా ఉందో చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది.'అని గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications