Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గబ్బా కంటే ఇండోర్ పిచ్ దారుణమా? ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఫైర్!

Sunil Gavaskar slams ICC and ask How many points did Gabba get? over Indore pitch poor rating

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తీరుపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడాన్ని తప్పుబట్టాడు. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌కు ఏ రేటింగ్ ఇచ్చారని నిలదీసాడు. గబ్బా కంటే ఇండోర్ పిచ్ దారుణంగా కనిపించిందా? అని మండిపడ్డాడు. ఇక శుక్రవారం ముగిసిన ఇండోర్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

తొలి రోజు నుంచే పిచ్‌పై టర్న్ ఉండటంతో బ్యాటర్ల బెంబేలెత్తిపోయారు. దాంతో మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఇక ఈ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్.. పిచ్ నాసిరకంగా ఉందని, బంతి, బ్యాట్ మధ్య సమతూకంగా పోరు జరగలేదని ఐసీసీకి నివేధించాడు. అంతేకాకుండా పిచ్‌పై అనూహ్య బౌన్స్ కనిపించిందన్నాడు. బ్రాడ్ నివేదికతో ఐసీసీ ఇండోర్ పిచ్‌కు పూర్ రేటింగ్ ఇస్తూ 3 డీమెరిట్ పాయింట్లు విధించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాలని బీసీసీఐకి సూచించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ మైదానానికి ఏడాది కాలంలో ఐదు డీమెరిట్ పాయింట్స్ వస్తే ఆ గ్రౌండ్‌ను ఐదేళ్ల పాటు నిషేధిస్తారు.

ఇండోర్ వికెట్‌కు పూర్ రేటింగ్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవాస్కర్.. ఇండియా టుడే చానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.'ఇండోర్ మైదానానికి పూర్ రేటింగ్ ఇచ్చారు సరే. గతేడాది డిసెంబర్‌లో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. మరి గబ్బాకు ఎన్ని డీ మెరిట్ పాయింట్స్ ఇచ్చారు.? ఆ టెస్టుకు మ్యాచ్ రిఫరీ ఎవరు వ్యవహరించారు?'అని గవాస్కర్ ఘాటుగా ప్రశ్నించాడు.

ఇక డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సౌతాఫ్రికా.. డిసెంబర్ 17న గబ్బా వేదికగా రెండో టెస్టు ఆడింది. పేస్‌, బౌన్స్‌కు అనుకూలమైన పిచ్ రెడీ చేయడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 152 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా కూడా తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులను ఛేదించడానికి 4 కీలక వికెట్లు కోల్పోయింది. రెండు రోజులు పూర్తి కాకుండానే ఈ మ్యాచ్ ముగిసింది. అప్పట్లో ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లోనే ఆసీస్ స్టార్ ప్లేయర్స్ కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఈ పిచ్‌కు ఏం రేటింగ్ ఇచ్చారని గవాస్కర్ నిలదీసాడు.

Story first published: Saturday, March 4, 2023, 17:55 [IST]
Other articles published on Mar 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+