వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా సెకండ్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను ఆడించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. సొంతగడ్డపై జైస్వాల్ చెలరేగుతాడని, అతని బ్యాటింగ్‌కు భారత కండిషన్స్ సరిగ్గా సరిపోతాయని చెప్పాడు.
జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్(171) తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో రాణించాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మకు జతగా అతనే ఓపెనింగ్ చేస్తున్నాడు. లెఫ్టాండర్ కావడంతో అతనికి ప్రాధాన్యత దక్కుతుంది.

యశస్వి జైస్వాల్ రాకతో అప్పటి వరకు ఓపెనర్‌గా సత్తా చాటిన శుభ్‌మన్ గిల్ ఫస్ట్ డౌన్‌లో ఆడుతున్నాడు. అయితే మూడో స్థానంలో గిల్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే అతన్ని మళ్లీ ఓపెనర్‌గా ఆడించాలనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. జైస్వాల్‌కే అవకాశం ఇవ్వాలని సూచించాడు.
'హోమ్ కండిషన్స్‌లో యశస్వి జైస్వాల్ ఈజీగా సెట్ అవుతాడు. అతను లెఫ్టాండర్ కూడా. ఈ సిరీస్‌లో సత్తా చాటి టీమిండియా టెస్ట్ టీమ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు. శ్రేయస్ అయ్యర్ కూడా భారత కండిషన్స్‌లో అద్భుతంగా రాణించగలడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ పిచ్‌లపై అతను చెలరేగాడు.

టెస్ట్ సిరీస్‌లోనూ నెంబర్ 5లో అలానే రాణిస్తాడని ఆశిస్తున్నా. ప్రపంచకప్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన అతను పిచ్‌ను రీడ్ చేసిన తర్వాత ధాటిగా ఆడాడు. అతని బ్యాటింగ్ చూడ ముచ్చటగా సాగింది. టెస్ట్ సిరీస్‌లోనూ ఆ ప్రదర్శనను పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా.
హైదరాబాద్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను తెలివిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పిచ్‌లో పెద్దగా టర్న్ లభించదు. ఒకవేళ ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి శుభారంభం అందుకుంటే.. రోహిత్ తన బౌలర్లను ఎలా ఉపయోగిస్తాడో చూడాలి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.