
నేనైతే ఇద్దరిని ఆడిస్తా..
ఎందుకంటే ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో కార్తీక్‌ను కొన్ని మ్యాచ్‌ల్లో పక్కనపెట్టారు. అతని స్థానంలో బరిలోకి దిగిన రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్‌ను ఆడించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. మెగా ఈవెంట్‌లో విజయం సాధించాలంటే కొన్ని రిస్క్‌లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. తాను సారథి అయితే వచ్చే ప్రపంచకప్‌లో రిషభ్ పంత్‌తోపాటు దినేశ్ కార్తిక్‌నుతుది జట్టులోకి తీసుకుంటానని చెప్పాడు.

రిస్క్ తీసుకోవాల్సిందే..
'నేను రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్‌లను తుది జట్టులో ఆడిస్తా. పంత్ ఐదో స్థానంలో.. హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తా. అవసరమైతే వీరిద్దరి స్థానాలను అటుఇటు మారుస్తా. ఇక దినేశ్ కార్తిక్‌ను లోయర్ ఆర్డర్‌లో ఏడో స్థానంలో ఆడిస్తా. హార్దిక్ పాండ్యా కాకుండా మరో నలుగురు కీలక బౌలర్లను తీసుకుంటా. మెగా ఈవెంట్‌లో రిస్క్ తీసుకోకపోతే విజయాలను సాధించడం కష్టం. అన్ని విభాగాల్లోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటేనే ఫలితం అనుకూలంగా వస్తుంది'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ విభాగం మరింత బలంగా..
గాయాల నుంచి కోలుకొని జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి రావడం శుభపరిణామమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.'ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టు బాగుంది. సమతూకంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే ఈసారి టీమిండియా ప్రపంచకప్‌ను గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నా. ఆసియా కప్‌లో జరిగిందంతా భారత్‌కు ఓ హెచ్చరిక. అయితే, వరల్డ్ కప్‌తో టీమిండియా తిరిగి వస్తుందని బలంగా నమ్ముతున్నా.

టైటిల్ మనదే..
బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు మనమంతా మద్దతుగా నిలవాలి. ఆసియా కప్‌లో సరైన బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగలేకపోయాం. బుమ్రా, హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టం కనిపించింది. అయితే, ప్రపంచకప్ జట్టులోకి రావడం శుభపరిణామం. లక్ష్యాలను కాపాడుకోవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు'' అని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.


Click it and Unblock the Notifications
