విరాట్ కోహ్లీ ఆ చెత్త షాట్ ఆడాల్సింది కాదు: సునీల్ గవాస్కర్

బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీకి.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ లాంటిది. దాంతో తనకు అచ్చొచ్చిన మైదానంలో విరాట్ సెంచరీ చేస్తాడని, మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

షాట్ సెలెక్షన్ రాంగ్..
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై విరాట్ కోహ్లీ తడబడ్డాడు. అయితే ఓ చూడచక్కటి కవర్ డ్రైవ్‌తో క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన విరాట్.. చివరకు 23 పరుగులు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే ఆ బంతిని మిస్ అయినప్పుడే ఔటయ్యానని విరాట్ కోహ్లీ గ్రహించడని దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అసలు విరాట్ కోహ్లీ ఆ షాట్ ఆడాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే ఓ చానెల్‌తో మాట్లాడిన గవాస్కర్.. విరాట్ షాట్ సెలెక్షన్‌ను తప్పుబట్టాడు.

అతనికి ఎప్పుడూ ఇబ్బందే
'విరాట్ కోహ్లీ ఆ షాట్ ఆడాల్సింది కాదు. మొహాలీలో జరిగిన తొలి టెస్ట్‌లో బ్యాక్‌ఫుట్‌పై ఆడినట్లుగానే ఈ రోజు కూడా ఆడదామనుకున్నాడు. ఆ బంతిని స్ట్రైయిట్‌గా ఆడుదామని కోహ్లీ భావించాడు. కానీ బంతి తక్కువ ఎత్తులో వచ్చి బ్యాట్‌ను తప్పించుకొని ప్యాడ్లను తాకింది. అయితే కోహ్లీ ఆ షాట్ ఆడడానికి ఎప్పుడూ ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఆ బంతి మిస్ అయ్యిందంటే కచ్చితంగా ఎల్బీగా వెనుదిరిగుతాడు'అని గవాస్కర్ పేర్కొన్నాడు.

పట్టు బిగించిన భారత్..
బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాట్‌తో, బంతితో భారత్ సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు.
అనంతరం జస్‌ప్రీత్ బుమ్రా (3/15), మహ్మద్ షమీ (2/18)ల ధాటికి లంక 86/6తో నిలిచింది. మాథ్యూస్ (85 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) చెప్పుకోదగ్గ ఒక్కడే ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ఆఖరుకు డిక్వెలా (13), ఎంబుల్దేనియా (0) క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications