Sunil Gavaskar: భువనేశ్వర్ కుమార్‌ను పక్కనపెట్టి ఆ యువ పేసర్‌కు చోటివ్వాలి!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను పక్కనపెట్టాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అతని స్థానంలో యువ పేసర్ దీపక్ చాహర్‌ను ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. గాయంతో జట్టుకు దూరమై రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి భువీ మునపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 64, 67 పరుగులు ఇచ్చుకొని దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమిండియా రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఐపీఎల్ 2018 నుంచి భువీ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. జట్టులోకి వస్తూ పోతూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

సూపర్ ఫామ్‌లో దీపక్ చాహర్..
మరోవైపు దీపక్ చాహర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 17 టీ20ల్లో 23 వికెట్లు తీశాడు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల ఘనతను కూడా అందుకున్నాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో వన్డేలోకి అరంగేట్రం చేసిన దీపక్ చాహర్.. 6 వికెట్లతో పాటు ఓ మ్యాచ్‌లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశమివ్వాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన దీపక్ చాహర్ చేరికతో లోయరార్డర్ బ్యాటింగ్ మరింత బలంగా మారుతుందన్నాడు.

గత రెండేళ్లుగా..
‘దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. పైగా అతను యువకుడు. భువనేశ్వర్ కుమార్ తరహా బౌలర్. అంతేకాకుండా లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. భువనేశ్వర్ టీమిండియాకు ఎంతోసేవ చేశాడు. కానీ గతేడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌లో, ఫ్రాంచైజీ లీగ్‌లో ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. ఆరంభంలోనే కాకుండా స్లాగ్ ఓవర్లలో కూడా దారళంగా పరుగులిస్తున్నాడు. అతను అద్భుతమైన యార్కర్లతో పాటు స్లోయర్ డెలివరీలు కూడా వేస్తాడు. కానీ అవి ఇప్పుడు పనిచేయడం లేదు. భువీ బౌలింగ్‌ను ప్రత్యర్థి టీమ్స్ బాగా రీడ్ చేసి పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నాయి. కాబట్టి అతన్ని పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది'అపి గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

వన్డే సిరీస్ కూడా గోవిందా..
సౌతాఫ్రికా గడ్డపై అడుగు పెట్టే ముందు రెండు ఫార్మాట్స్‌లోనూ విజేతగా నిలిచేలా పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరకు పేలవ ప్రదర్శనతో రెండు సిరీస్‌లూ కోల్పోయింది. టెస్టు సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న టీమిండియా మ్యాచ్ మ్యాచ్‌కు మరింత చెత్త పెర్ఫామెన్స్ కనబర్చి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌నూ చేజార్చుకుంది. తొలి పోరుకు దాదాపు రీప్లేలా కనిపించిన రెండో వన్డేలోనూ రాహుల్ సేన సునాయాసంగా తలవంచింది.
పసలేని బ్యాటింగ్‌తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితం కాగా... ఆపై బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. మరోవైపు సమష్టిగా చెలరేగిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకొని సిరీస్ కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications