టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్థాన్ ప్రధాన పేసర్ అయిన షాహిన్ షా అఫ్రిదిని నెట్‌బాల్ స్పిన్నర్‌లా తిలక్ వర్మ చితక్కొట్టాడని కొనియాడాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో 7 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్నందుకుందని తెలిపాడు.ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా గత ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.
అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. అభిషేక్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీకి తోడుగా..శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 8 ఫోర్లతో 47) రాణించాడు. ఈ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. 59 బంతుల్లో 105 పరుగులను జోడించారు. చివర్లో తిలక్ వర్మ(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఈ మ్యాచ్‌పై ఓ దినపత్రికకు రాసిన కాలమ్‌లో తిలక్ వర్మపై గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'చివర్లో మరో సూపర్ టాలెంటెడ్ బ్యాటర్ తిలక్ వర్మ.. పాకిస్థాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా అఫ్రిదిని నెట్ బాల్ స్పిన్నర్‌లా ట్రీట్ చేస్తూ విరుచుకుపడ్డాడు. దాంతో కొన్ని బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది.'అని గవాస్కర్ పేర్కొన్నాడు.
అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాది తిలక్ వర్మ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు వేసిన అఫ్రిది 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. సైమ్ అయుబ్ 3 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకోగా.. అబ్రర్ అహ్మద్ నాలుగు ఓవర్లలో 42 పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు. ఈ గెలుపుతో ఆసియా కప్‌లో భారత్ ఓటమెరుగని జట్టుగా నిలిచింది. తదుపరి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఇదే జోరులో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. బుధవారం ఈ మ్యాచ్ జరగనుంది.