For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: గత 50 ఏళ్లలో ఇలాంటి సెంచరీ చూడలేదయ్యా రాహుల్!

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సౌతాఫ్రికా గడ్డపై కేఎల్ రాహుల్ చరిత్రలో నిలిచిపోయే శతకాన్ని సాధించాడని కొనియాడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు శతకం బాదాడు.

121 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన భారత్‌ను విరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో శతకం సాధించడంతో పాటు జట్టుకు 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

Sunil Gavaskar says This Hundred By KL Rahul Is In Top 10 Centuries In Indias History

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. కేఎల్ రాహుల్ అసాధారణ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. గత 50 ఏళ్లలో కేఎల్ రాహుల్ సాధించిన శతకాన్ని చూడలేదని, భారత టెస్ట్ చరిత్రలోని టాప్-10 ఇన్నింగ్స్‌ల్లో ఇది నిలుస్తుందని చెప్పాడు. సిక్సర్‌తో కేఎల్ రాహుల్ శతకాన్ని పూర్తి చేసుకున్న వెంటనే సునీల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'గత 50 ఏళ్లుగా నేను క్రికెట్ చూస్తున్నాను. రాహుల్ సాధించిన శతకం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టాప్-10 ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను'అని గవాస్కర్ కొనియాడాడు.

ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. 'కేఎల్ రాహుల్ తల ఎత్తుకునే సెంచరీ బాదాడు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కానీ రాహుల్ అత్యంత అరుదైన ఆటగాడు.'అని హర్భా భోగ్లే ట్వీట్ చేశాడు.

ఈ శతకంతో కేఎల్ రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచూరియన్ వేదికగా రెండు సెంచరీలు సాధించిన ఏకైక పర్యాటక జట్టు ప్లేయర్‌గా నిలిచాడు. 2021-22 దక్షిణాఫ్రికా పర్యటనలో ఇదే గ్రౌండ్‌లో అతడు 123 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, December 27, 2023, 17:30 [IST]
Other articles published on Dec 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+