For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటగాళ్లతో మ్యూజికల్ చైర్ ఆపండి.. ఒత్తిడి అంటే ఒంగబెట్టి గుద్దుతా.. టీమిండియా ప్రయోగాలపై మాజీ క్రికెటర్ ఫైర్

 Sunil Gavaskar says Stop talking about workload, no more experiments after Asia Cup flop show

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022లో టీమిండియా ఘోర పరాజయానికి టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తుది జట్టులోని ఆటగాళ్లను తరుచూ మాట్లాడటం వల్లనే టీమిండియాకు ఈ గతి పట్టిందని అభిప్రాయపడ్డాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దాంతో ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. పాకిస్థాన్‌, శ్రీలంక జట్ల మీద ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా పరాజయం పాలైంది.

ప్రయోగాలు ఆపండి..

ప్రయోగాలు ఆపండి..

దీంతో భారత ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియా టుడేతో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పదకొండు మంది ఆటగాళ్లు తరచూ కలిసి ఆడకపోవంతోనే ఆసియా కప్‌లో లయ అందుకోలేకపోయారని పేర్కొన్నాడు. అందుకే టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించే జట్టులోని ఆటగాళ్లనే సౌతాఫ్రికా, ఆసీస్‌తో జరిగే సిరీస్‌ల్లో ఆడించాలని సూచించాడు. జట్టులో ప్రయోగాలకు స్వస్తి చెప్పాలని, పని ఒత్తిడి గురించి మాట్లాడటం ఆపాలని గవాస్కర్‌ సూచించాడు.

విశ్రాంతి ఇవ్వడమే..

విశ్రాంతి ఇవ్వడమే..

'ఆసియా కప్‌ 2022, టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లలో ఎక్కువ మందిని జింబాబ్వే పర్యటనకు పంపించి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఓ నలుగురు ఐదుగురిని ఎంపిక చేశారు. అయితే జింబాబ్వేపై రాణించిన వారికి ఆసియా కప్‌ తుది జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. అందుకే వారంతా కుదురుకోవడానికి సమయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇకనైనా టీ20 ప్రపంచకప్‌ జరిగేలోపు ఆడే సిరీస్‌ల్లో ప్రయోగాలు చేయొద్దు. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి ఇస్తున్నామనే మాటలను ఆపేయాలి.

 ఆ రెండు సిరీస్‌ల్లో..

ఆ రెండు సిరీస్‌ల్లో..

భారత్‌ తరఫున మాత్రమే ఆడితే వర్క్‌లోడ్‌ అనేది సమస్య కాదు. ఇప్పుడు ఆసియా కప్‌ నుంచి ముందుగానే వైదొలిగితే అదనంగా మరో మూడు రోజులపాటు రెస్ట్‌ దొరుకుతుంది. అప్పుడు విశ్రాంతి తీసుకొని ఆసీస్‌‌తో సిరీస్‌కు సన్నద్ధం కావాలి'' అని గావాస్కర్ సూచించాడు. స్వదేశంలోనే సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు ఆసీస్‌తో మూడు టీ20లు.. అలాగే సౌతాఫ్రికాతో సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 11 వరకు మూడు టీ20లు, మూడు వన్డే సిరీస్‌లను భారత్‌ ఆడనుంది.

Story first published: Wednesday, September 7, 2022, 20:48 [IST]
Other articles published on Sep 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+