Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్పాన్సర్స్‌ను పెంచుకోవడానికే భారత్ ఆటగాళ్లను ఆడమంటున్నారు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar says Some ex overseas players want Indian stars to increase sponsorship for their leagues

న్యూఢిల్లీ: పాపులారిటీతో పాటు స్పాన్సర్స్‌ను పెంచుకోవడానికే విదేశీ లీగ్స్ ఆడేలా భారత ఆటగాళ్లకు అనుమతివ్వాలని ఆయా దేశాల మాజీ క్రికెటర్లు బీసీసీఐని కోరుతున్నారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అయితే ఆటగాళ్లను సురక్షితంగా ఉంచేందుకే బీసీసీఐ విదేశీ లీగ్స్ ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదని గవాస్కర్ స్పష్టం చేశాడు. ప్లేయర్లపై పని ఒత్తిడి, మానసిక సమస్యలు ఎదురు కాకుడదనే ఈ నిబంధనను పెట్టిందని వివరించాడు. ఇక బీసీసీఐ కాంట్రాక్టు కలిగిన భారత ఆటగాళ్లు వీదేశీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఆడాలనుకుంటే బీసీసీఐ వద్ద నిరభ్యంతకర పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు అయితే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినవారికే బీసీసీఐ ఎన్‌ఓసీ జారీ చేసింది. అయితే సౌతాఫ్రికాలో కొత్తగా ప్రారంభం కానున్న టీ20 లీగ్, యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగమవ్వడంతో భారత ఆటగాళ్లకు విదేశీ టోర్నీల్లో అనుమతివ్వాలనే వాదన తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సైతం బిగ్ బాష్ లీగ్ ఆడేందుకు భారత ఆటగాళ్లకు ఎన్‌ఓసీ జారీ చేయాలని బీసీసీఐని కోరాడు. అలా చేయడం వల్ల ఐపీఎల్ పాపులారిటీ ప్రపంచానికి విస్తరిస్తుందని, లేకుంటే తగ్గిపోయే అవకాశం ఉందని హెచ్చరించాడు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన గవాస్కర్.. తమ ఫ్రాంచైజీ లీగ్స్ పాపులారిటీ పెంచుకోవడానికే ఇలా మాట్లాడుతున్నారని చెప్పాడు. స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించాడు. 'కొంతమంది ఓవర్‌సీస్ మాజీ ఆటగాళ్లు భారత ఆటగాళ్లను బిగ్ బాష్, హండ్రెడ్ వంటి విదేశీ లీగ్‌లు ఆడేందుకు అనుమతించాలని మాట్లాడుతున్నారు. తద్వారా తమ లీగ్స్ పాపులారిటీతో పాటు స్పాన్సర్స్‌ను పెంచుకోవాలని భావిస్తున్నారు. వాళ్లు తమ క్రికెట్ గురించి ఆందోళన పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

బుమ్రా,కోహ్లీ ఫామ్‌లో లేరు ఎలా మరి *Cricket | Telugu OneIndia India Will Win Asia Cup Without Bumrah

కానీ భారత క్రికెట్‌లో ఆటగాళ్లను రక్షించేందుకే వీదేశీ లీగ్స్ ఆడించడం లేదు. ప్లేయర్లపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఆటగాళ్లు ఫ్రెష్‌గా బరిలోకి దిగడాన్ని ఓవర్‌సీస్ మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు .వారు కేవలం భారత ఆటగాళ్లను మాత్రమే తమ లీగ్‌ల్లో భాగం కావాలని చెబుతున్నారు. కానీ సపోర్ట్ స్టార్, ఇతర సిబ్బంది గురించి మాట్లాడుతున్నారు. గత ఆరు ఏళ్లు క్రికెట్‌కు సంబంధించిన లీగ్‌ల్లో భారత సిబ్బంది అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ఆటగాళ్లు మాత్రమే కాకుండా సహాయక సిబ్బంది కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇది ఇలానే సాగితే ఐపీఎల్ కాస్త ఆస్ట్రేలియా లీగ్‌లా మారే ప్రమాదం ఉంది.

Story first published: Thursday, August 11, 2022, 13:05 [IST]
Other articles published on Aug 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+