Sunil Gavaskar: భారత్ భారీ విజయం.. న్యూజిలాండ్ టీమ్‌లో వణుకు!

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు భారీ విజయాలతో టీమిండియా సెమీస్ రేసులోకి దూసుకురావడంతో న్యూజిలాండ్ జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు సాధించిన టీమిండియా మెరుగైన రన్‌రేట్ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలించింది. దాంతో సెమీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్.. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లతో గ్రూప్-1 నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందో తెలిసిపోనుండగా.. ఆదివారం అఫ్గాన్ - న్యూజిలాండ్ మ్యాచ్‌తో గ్రూప్-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందో స్పష్టత రానుంది.

మెరుగైన రన్‌రేట్‌తో..
స్కాట్లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 81 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్న భారత్.. గ్రూప్-2లో మిగతా జట్ల కన్నా మెరుగైన నెట్ రన్‌రేట్ (1.619) సాధించింది. దీంతో సెమీస్ పోరులో న్యూజిలాండ్ (1.277), అఫ్గాన్ (1.481) అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న విలియమ్సన్ సేన నేరుగా సెమీస్ చేరుతుంది. అదే అఫ్గాన్ గెలిస్తే.. టీమిండియాతో సమానంగా నాలుగు పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. అప్పుడు కోహ్లీసేన చివరి మ్యాచ్‌లో నమీబియాను ఎంత తేడాతో ఓడిస్తే సరిపోతుందో లెక్క తేలనుంది.

భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై ప్రెజర్
ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే మ్యాచ్ అటు అఫ్గాన్‌లో, ఇటు న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెంచుతుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'భారత ఘన విజయంతో అఫ్గాన్, న్యూజిలాండ్ జట్ల మీదా ఒత్తిడి నెలకొంది. ఇదివరకు ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు టీమిండియా రన్‌రేట్ తక్కువగా ఉండేది. అయితే, ఇప్పుడు ఆ రెండు జట్ల కన్నా భారత్ రన్‌రేటే మెరుగ్గా ఉండటంతో ఆ రెండు జట్లపై ఒత్తిడి నెలకొంది' అని గవాస్కర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ అన్నాడు.

పక్కా లెక్కతో..
ఇక స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టిందని ప్రశంసించాడు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిందని, 86 పరుగుల చేజింగ్‌లో టీమిండియా లెక్కలు తెలుసుకునే బ్యాటింగ్ చేసిందని కొనియాడాడు. 'భారత జట్టులోని ప్రతీ ఒక్కరూ దిమ్మతిరిగే ప్రదర్శన కనబర్చారు. బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం, బ్యాటర్లు ఆడిన తీరు పరిస్థితులను అంచనా వేస్తూ సరైన లెక్కతో ఆడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రోహిత్, రాహుల్ అద్భుతమైన క్రికెట్ షాట్స్ ఆడారు. ఇది టీమిండియాకు చాలా మంచింది. 86 పరుగుల లక్ష్యచేధన సులువనే విషయం టీమిండియాకు తెలుసు. అందుకే ఓపెనర్లే సరైన వ్యూహంతో ధాటిగా ఆడి స్కాట్లాండ్‌పై ఒత్తిడిని పెంచారు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications