
ఎందుకు అతిగా స్పందిస్తున్నారు.?
‘మ్యాచ్ రెఫరీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ బూన్.. జడేజాకు సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌ను ఆడించే విషయంలో అతనికి ఎలాంటి సమస్య కనిపించలేదు. కానీ, రీప్లేస్‌మెంట్ అనేది సరిగ్గా ఉండాలని అంటున్నారు. చాహల్ ఆల్‌రౌండర్ కాదని వాదిస్తున్నారు. ఇది సరైన రీప్లేస్‌మెంట్. ఈ విషయంలో ఆసీస్‌కు చెందిన రెఫరీకి ఎలాంటి సమస్య లేదు. కానీ చాలా మంది ఎందుకు అతిగా స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు.

బౌన్సర్లు ఆడలేనివాడు..
పాత తరం మనిషినైన నేను వ్యక్తిగతంగా కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ను వ్యతిరేకిస్తా. ఎందుకంటే బౌన్సర్లు ఆడే కెపాసిటీ లేని వ్యక్తికి సబ్‌స్టిట్యూట్ అనవసరమని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు అమల్లో ఉన్న రూల్స్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు చాన్స్ ఇస్తున్నాయి. ఆ రూల్స్ ప్రకారమే జడేజాకు బదులుగా చాహల్‌ను ఆడించారు. ఇందులో వివాదం చేయాల్సింది ఏమీ లేదు'అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.

పరిస్థితుల వల్లే..
జడేజా స్థానంలో చహల్ ఆడటంకంటే అందుకు దారి తీసిన పరిస్థితులు ఈ వివాదానికి కారణం. 19వ ఓవర్లో మూడు బంతుల తర్వాత జడేజా కండరాల నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. తర్వాతి ఓవర్ రెండో బంతికి స్టార్క్ వేసిన బంతి అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అది గాల్లోకి లేచి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లగా హెన్రిక్స్ క్యాచ్ వదిలేశాడంటే దాని తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. అయితే ఆ సమయంలో భారత ఫిజియో రాకపోగా, జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మాత్రమే జడేజా ‘కాంకషన్'కు గురైనట్లు, తలకు బంతి తగలడంతో మగతగా ఉన్నట్లు భారత వైద్య బృందం తేల్చడంతో సబ్‌స్టిట్యూట్ అవసరం కలిగింది.

రూల్స్ ప్రకారం..
ఐసీసీ నిబంధనల ప్రకారం సరిగ్గా జడేజా శైలిలాంటి ‘లైక్ ఫర్ లైక్' ఆటగాడు మన జట్టులో మరొకరు లేరు. దాంతో బౌలింగ్ చేయగలిగే చాహల్‌ను భారత్ ఎంపిక చేసుకుంది. అతను మ్యాచ్‌ను మలుపు తిప్పడంతోనే చర్చ మొదలైంది. నిబంధనల ప్రకారం బంతి తగలగానే వైద్యులు ఆటగాడిని పరీక్షించాలి. జడేజా విషయంలో ఇలా జరగలేదు. అయితే కన్‌కషన్ ప్రభావం వెంటనే కనబడకపోవడం కూడా సహజం. ‘ఇలాంటి విషయంలో డాక్టర్ నివేదికను మనం నమ్మాలి' అంటూ ఆసీస్ కెప్టెన్ ఫించ్ చెప్పడం వివాదాన్ని ముగించే సానుకూల వ్యాఖ్యగానే చూడాలి. గాయం తీవ్రత దృష్ట్యా టీ20 సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు జడేజా దూరమైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












