Sunil Gavaskar: అప్పుడు డీఆర్‌ఎస్ కింగ్ ధోనీ అయితే ఇప్పుడు రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్ తన ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టాడని కితాబిచ్చాడు. అతని కెప్టెన్సీకి 10 కి 9.99 మార్కులు ఇచ్చాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన చారిత్రాత్మక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రివ్యూల విషయంలో 100 శాతం సక్సెస్ అయ్యాడు. తీసుకున్న మూడు రివ్యూలు భారత్‌కు అనుకూలంగా వచ్చాయి.

ధోనీ రివ్యూ సిస్టమ్..
రివ్యూలు ఉపయోగించడంలో మహేంద్రసింగ్ ధోనీని మించిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఎంతలా అంటే డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనే పిలిచేంతలా అతను పాపులర్ అయ్యాడు. ఇప్పుడు దానికి మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కొత్త పేరు పెట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లోని 22వ ఓవర్లో చాహల్ బౌలింగ్‌లో బ్రూక్స్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల చాహల్ విసిరిన బంతి.. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లింది.

కోహ్లీ చెప్పడంతో..
భారత క్రికెటర్లు ఔట్ కోసం అప్పీలు చేయగా, అంపైర్ నిరాకరించాడు.అనంతరం డీఆర్ఎస్ కోరే ముందు కెప్టెన్ రోహిత్.. పంత్ ఒపీనియన్ అడగ్గా అతడు స్పష్టంగా చెప్పలేకపోయాడు. వెంటనే కోహ్లీ వచ్చి తీసుకోమని చెప్పగా, రోహిత్ మరేం ఆలోచించకుండా డీఆర్ఎస్ తీసుకుని విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో కామెంటరీ చేస్తున్న సునీల్ గవాస్కర్.. ఇకపై డీఆర్ఎస్ అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్' కాదని.. 'డెఫినిట్లీ రోహిత్ సిస్టమ్' అంటూ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్సీ సూపరో సూపర్..
మ్యాచ్ ఫలితంపై ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘ఇది రోహిత్‌కు కెప్టెన్‌గా అద్భుతమైన ప్రారంభం. టాస్ గెలిచి రోహిత్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. అతనికి ఈ విజయం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. అదే విధంగా రోహిత్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫీల్డ్ ప్లేసింగ్ కూడా రోహిత్ అద్భుతంగా పెట్టాడు. అదే విధంగా కీలక సమయాల్లో బౌలింగ్‌లో మార్పులు చేసి కెప్టెన్‌గా తాను ఎంటో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ ప్రదర్శనకి 10కి 9.99 ఇస్తున్నాను" అని గవాస్కర్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications