దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ విషయంలో రిస్క్ తీసుకోవాలి: సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బరిలోకి దిగే కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సరైన తుది జట్టు లేకనే ఆసియాకప్ 2022లో మూల్యం చెల్లించుకుంది. పదే పదే ఆటగాళ్లను మార్చి కనీసం ఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టారు. ఈ క్రమంలోనే ఫైనల్ ఎలెవన్‌ను ఎంచుకొని బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్లు రోహిత్ సేనకు సూచిస్తున్నారు. మెగా టోర్నీ కోసం15 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఎలాంటి సంచలనాలకు చోటివ్వలేదు. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఆసియాకప్ టీమ్‌నే కొనసాగించింది. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తో పాటు రిషభ్ పంత్ కూడా ప్లేస్ దక్కించుకున్నారు.

దినేశ్ కార్తీక్? రిషభ్ పంత్? ఎవరు
అయితే ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులో ఆడించాలి..? అనే దానిమీద టీమిండియా వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఈ ఏడాది మేలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. కొన్ని మ్యాచ్‌ల్లో పంత్‌తో కలిసి ఆడాడు. ఆసియా కప్‌లో పాకిస్తాన్ తో తొలి మ్యాచ్‌లో కార్తీక్ ఆడగా మిగిలిన నాలుగు మ్యాచులలో పంత్ కు అవకాశం దక్కింది. మరి రాబోయే పొట్టి ప్రపంచకప్ లో తుది జట్టులో ఉండే అవకాశం ఎవరికి దక్కనుంది..? ఎవరో ఒకరికే రోహిత్ శర్మ ఓటేస్తాడా..? లేదా ఇద్దరినీ ఆడిస్తాడా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

ఇద్దరినీ తీసుకోవడమే ఉత్తమం..
అయితే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఇద్దరినీ ఆడించాలని రోహిత్ శర్మకు సూచించాడు. మెగా టోర్నీలో రిస్క్ తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఇక ఫినిషర్‌గా భావిస్తున్న దినేశ్ కార్తీక్.. ఏడో నెంబర్‌లో బ్యాటింగ్ కు వస్తే టీమిండియాకు మంచింది. ఇద్దరినీ ఆడించడమే ఉత్తమం. తద్వారా జట్టులో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యండ్ కాంబినేషన్ కుదురుతుంది. అంతేగాక జట్టులో సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

రిస్క్ తీసుకోవాలి..
ఆరుగురు బౌలర్లతో కాకుండా రోహిత్ శర్మ వచ్చే ప్రపంచకప్ లో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగితే బెటరని గవాస్కర్ తెలిపాడు. ఇదే విషయమై సన్నీ స్పందిస్తూ.. 'నేనైతే ఐదుగురు బౌలర్లతో వెళ్లడమే మంచిదని చెబుతా. నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు హార్ధిక్ పాండ్యా కూడా ఉండనే ఉన్నాడు. ఇలాంటి కఠిన నిర్ణయాల ద్వారా మీరు రిస్కులు తీసుకోవాలి. రిస్కులు తీసుకుంటేనే కదా రివార్డులు వచ్చేవి..' అని చెప్పాడు. అయితే సన్నీ చెప్పిన ఐదుగురు బౌలర్ల ఫార్ములా టీమిండియాకు అంత అచ్చిరాలేదు. ఆసియా కప్ లో భారత జట్టు ఓటమికి ఆ ఫార్ములా కూడా ప్రధాన కారణమైంది.
ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఒక్కరు విఫలమైనా.. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచలేని పరిస్థితి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications