Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాళ్లది బజ్‌బాల్ అయితే మనది విరాట్ బాల్.. చూసుకుందాం: సునీల్ గవాస్కర్

ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌ అప్రోచ్‌పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌ది బజ్‌బాల్ అప్రోచ్ అయితే ఇండియాది విరాట్ బాల్ అస్త్రమని తెలిపాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్‌ ఆటను విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో ధీటుగా ఎదుర్కోంటాడని జోస్యం చెప్పాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉందని గుర్తు చేశాడు.

డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడిన గవాస్కర్.. ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్ అప్రోచ్ భారత్ గడ్డపై సక్సెస్ అవుతుందని చెప్పాడు.

Sunil Gavaskar says if they have Bazball, we have Viratball ahead of IND vs ENG 5 test series

'ఇంగ్లండ్‌ది బజ్‌బాల్ అయితే మనది విరాట్ బాల్ అప్రోచ్. విరాట్ కోహ్లీ ధీటుగా బదులివ్వగలడు. ఇక భారత్‌‌లో బజ్‌బాల్ అప్రోచ్ పని చేస్తోంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా భారత్‌లోని మైదానల్లో బౌండరీలు చిన్నగా మారాయి. బ్యాట్లు కూడా భిన్నంగా తయారు చేస్తున్నారు. మిస్‌టైమ్ అయిన సిక్సర్లు వెళ్తున్నాయి.

కాబట్టి బజ్‌బాల్ అప్రోచ్ వర్కౌట్ కాదని చెప్పడానికి ఎలాంటి కారణం లేదు. ఇంగ్లండ్ ఇదే అప్రోచ్‌తో బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్ల‌పై ఇంగ్లండ్ అటాకింగ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోంది. భారీ సిక్సర్లతో భయపట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో వారు ఔట్ కూడా కావచ్చు. కానీ వారి మానసికంగా పై చేయి సాధిస్తారు.

మన స్పిన్నర్లు కూడా చాలా టీ20 క్రికెట్ ఆడారు. కాబట్టి తెలివిగా బౌలింగ్ చేయాలి. టీ20ల్లో వికెట్లు తీయకున్నా సిక్సర్లు, ఫోర్లు ఇవ్వకుంటే చాలు అనే మెంటాలిటీతో బౌలింగ్ చేస్తారు. కానీ టెస్ట్‌ల్లో రెండు మూడు సిక్స్‌లు బాదిన జరిగే నష్టం పెద్దగా ఉండదు. కాబట్టి బ్యాటర్లు ఔటయ్యేలా బంతులు మారిస్తే ప్రభావంతంగా ఉంటుంది.

ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ అత్యంత కీలకం. హైదరాబాద్ పిచ్ విపరీతమైన పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. బజ్‌బాల్ అప్రోచ్‌కు ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. ఈ మ్యాచ్‌లో మన స్పిన్నర్లకు అసలు సిసలు పరీక్ష ఎదురుకాబోతుంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. భారత్ వేదికగా ఆ జట్టుతో ఇప్పటి వరకు 28 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 42.36 సగటుతో 1991 రన్స్ చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీతో పాటు రెండు శతకాలు ఉన్నాయి. అంతేకాకుండా టెస్ట్‌ల్లో విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారీ శతకం నమోదు చేశాడు.

Story first published: Sunday, January 21, 2024, 8:40 [IST]
Other articles published on Jan 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+