Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సారి గెలవకపోతే అది మీ చేతకానితనమే.. సాకులు చెప్పడానికి వీల్లేదు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar says If India dont win the trophy, it won’t be for lack of preparation

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022 బ్లాక్ బాస్టర్ భారత్ X పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ దాయాదుల పోరుకు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఆదివారం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెగా టోర్నీలో ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్ కావడంతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే దాయాది దేశాలు తలపడగా.. భారత్ ఓటమిపాలైంది. దాంతో ప్రతీకారంతో రగిలిపోతున్న టీమిండియా.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటుంది.

బిజీ షెడ్యూల్‌తోనే..

బిజీ షెడ్యూల్‌తోనే..

ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో పాక్ చేతుల్లో భారత్‌కు ఎదురైన మొట్టమొదటి పరాజయం ఇదే. అయితే అప్పుడు టీమిండియా ఓటమికి బిజీ షెడ్యూల్‌ కారణమని టీమ్‌మేనేజ్‌మెంట్ సాకులు చెప్పింది. టీమిండియా కోచింగ్ స్టాఫ్ కరోనా బారిన పడడంతో అర్ధాంతరంగా ఇంగ్లండ్ టూర్‌ నుంచి యూఏఈ చేరుకున్న టీమిండియా, ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో పాల్గొంది. క్యాష్‌ రిచ్ లీగ్ ముగిసిన వారం రోజులకే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడింది. బిజీ షెడ్యూల్, అలసట కారణంగా టీమిండియా ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిందని మేనేజ్‌మెంట్ సభ్యులు అప్పట్లో వివరణ ఇచ్చారు.

సాకులకు చాన్స్ లేదు..

సాకులకు చాన్స్ లేదు..

అయితే ఈసారి అలా సాకులు చెప్పే అవకాశం లేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. ఈసారి ప్రపంచకప్ గెలవకుంటే అది టీమిండియా చేతకానితనమేనన్నాడు. వర్క్‌లోడ్‌ పేరుతో చాలా మంది ప్లేయర్లు ఈ ఏడాది సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదని చెప్పాడు. ప్రిపరేషన్స్‌కు కావాల్సినంత సమయం దొరికిందన్నాడు. మిడ్‌డే దినపత్రికకు రాసిన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు.

ప్రిపరేషన్స్‌కు చాలా టైమ్..

ప్రిపరేషన్స్‌కు చాలా టైమ్..

'ఈసారి టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోతే, అది టీమిండియా చేతకాని తనమే అవుతుంది. ఎందుకంటే ఈ సారి జట్టు ప్రిపరేషన్స్‌కు కావాల్సినంత సమయం దొరికింది. బిజీ షెడ్యూల్ పేరుతో కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇస్తూ వచ్చారు. చాలామంది ప్లేయర్లు ఈ ఏడాది సగం మ్యాచులు కూడా ఆడలేదు. టీ20 వరల్డ్ కప్‌ ప్రిపరేషన్స్ కోసం మూడు వారాల ముందే ఆస్ట్రేలియాకి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడి వాతావరణానికి బాగా అలవాటుపడిపోయి ఉంటారు. ప్రాక్టీస్ గేమ్స్ ఆడారు... కాబట్టి ప్రిపరేషన్స్‌కి టైం లేదని చెప్పే అవకాశం లేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లు కూడా ఆడారు. కాబట్టి టెస్టులు అయ్యాక ఆడాం, వన్డే ఫార్మాట్‌కి వచ్చాం.

ఆ ఇద్దరు లేకపోయినా..

ఆ ఇద్దరు లేకపోయినా..

అని సాకులు చెప్పుకునే ఛాన్స్ కూడా లేదు. ద్వైపాక్షిక సిరీసుల్లో టీమిండియా ఎన్నో ఏళ్లుగా బాగా ఆడుతోంది. స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమిండియాకు తిరుగేలేదు. అయితే దేశాలు పెరిగితేనే భారత ఆటగాళ్ల ప్రదర్శన తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు భారత జట్టులో యువకులతో పాటు సీనియర్లు కూడా ఉన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేనంత మాత్రాన టీమిండియా వీక్ అయిపోదు. టీ20 మ్యాచుల ఫలితం ఒకటి రెండు బంతుల్లో మారిపోతుంది. దానికి కావాల్సింది స్కిల్స్‌ను సరైన సమయంలో ఎలా వాడాలో తెలియడమే.' అంటూ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, October 20, 2022, 14:23 [IST]
Other articles published on Oct 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+