విరాట్ కోహ్లీ సమస్య అదే.. 20 నిమిషాలు టైమ్ ఇస్తే పరిష్కరిస్తా: సునీల్ గవాస్కర్


న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకో 20 నిమిషాల సమయం కేటాయిస్తే అతని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. పరుగులు చేయాలనే ఆరాటమే విరాట్ కోహ్లీకి ప్రధాన సమస్యగా మారిందన్నాడు. పరుగుల కోసం తపిస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ ఆలోచన ఇలానే ఉంటుందని, కోహ్లీ కూడా అనని బంతులు ఆడేయాలని చూస్తున్నాడని గవాస్కర్ చెప్పాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ చాలా వరకు కష్టమైన బంతులకే ఔటయ్యాడన్నది వాస్తవమన్నాడు.

20 నిమిషాల టైమ్ ఇస్తే..
తాజాగా ఇండియా టూడేతో కోహ్లీ పేలవ ఫామ్‌పై స్పందించిన గవాస్కర్.. టైమ్ ఇస్తే అతనికి సాయం చేస్తానని తెలిపాడు. ‘కోహ్లీని కలిసి 20 నిమిషాలు మాట్లాడితే తనేం చేస్తే బాగుంటుందో చెప్పగలను. నా సలహాలు అతనికి ఉపయోగపడొచ్చు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ మీదికొచ్చే బంతుల విషయంలో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సుదీర్ఘ కాలం ఓపెనర్‌గా ఆడిన అనుభవంతో చెప్తున్నా.. ఒకే లైన్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడంటే కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

పరుగులు చేయాలనే ఆరాటమే..
పరుగులు చేయాలనే ఉద్దేశంతో అన్ని బంతులూ ఆడేస్తుండడమే విరాట్‌కు సమస్యగా మారింది. మనం చేసే తొలి తప్పే ఆఖరిది అయ్యుండేలా చూసుకోవాలి. అయితే కోహ్లీ ఇటీవల పరుగులు చేయలేకపోతుండడం వల్ల అన్ని బంతులూ ఆడేయాలని చూస్తున్నాడు. పరుగుల కోసం తపిస్తున్నపుడు బ్యాట్స్‌మెన్ ఆలోచన తీరు అలాగే ఉంటుంది. అయితే ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ చాలా వరకు కష్టమైన బంతులకే ఔటయ్యాడన్నది వాస్తవం.

కాస్త ఓపికగా ఉండండి..
అంతర్జాతీయ మ్యాచ్‌కు దూరంగా ఉంటే ఫామ్ అందుకోవడం కష్టమని వాదించేవాడిలో నేను ముందుంటా. అయితే విరాట్ కోహ్లీ విషయంలో కాస్త ఓపిక కనబర్చాల్సిన అవసరం ఉంది. అతని కమ్ బ్యాక్ కోసం వేసం చూడాలి. అతను భారత క్రికెట్‌కు ఎంతో చేశాడనే విషయం మరవద్దు. మూడు ఫార్మాట్లలో టన్నులకొద్ది పరుగులు చేశాడు. విభిన్న పరిస్థితుల్లో రాణించాడు. అతని ఖాతాలో 70 సెంచరీలున్నాయి. కాబట్టి ఆతృత కనబర్చకుండా కాస్త ఓపిక పట్టాలి. ఒక ఆటగాడు 32, 33 ఏళ్ల వయసుకు రాగానే జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన చేస్తాం. అది తప్పు. భారత్ తరఫున ఆడిన గొప్ప ఆటగాళ్లంతా ఇలాంటి వైఫల్యాలనుఎదుర్కొన్నారనే విషయాన్ని మరవద్దు'అని విమర్శకులకు గవాస్కర్ సూచించాడు.

ఇంగ్లండ్ టూర్‌లో అట్టర్ ఫ్లాఫ్..
ఇక విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. టెస్ట్, టీ20, వన్డే మూడు ఫార్మాట్లలో పేలవ ప్రదర్శన కనబర్చాడు. టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 11, 20 పరుగులు చేసిన విరాట్.. టీ20 సిరీస్‌లో 1, 11 పరుగులతో విఫలమయ్యాడు. గజ్జ గాయంతో తొలి వన్డేకు దూరంగా ఉన్న అతను వన్డే సిరీస్‌లోనూ 16, 17 పరుగులతో అదే పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఈ పర్యటనలో దాదాపు విరాట్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కే ఔటయ్యాడు. కోహ్లీకి ఆ బాల్స్ బలహీనతగా మారగా.. ప్రత్యర్థి బౌలర్లకు అస్త్రంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications