
పంత్ ఫినిషర్..
కామెంట్రీ చెబుతూనే ఈ ప్రయోగంపై స్పందించిన సునీల్ గవాస్కర్.. టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. ''రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా చూసి ఆశ్చర్యపోయాను. నా అభిప్రాయం ప్రకారం.. స్కోరును అనుసరించి అతను ఆరు లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. తను ఫినిషర్‌గా ఉండాలి. రోహిత్‌కు ఓపెనింగ్ జోడీగా రాహుల్ సరైనవాడు. సూర్యకుమార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత పంత్... వాషింగ్టన్ సుందర్ రావాలి'' అని పేర్కొన్నారు.

జడేజా లేకపోవడం..
ఈ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. జడేజా సేవలను టీమిండియా కోల్పోతుందని చెప్పాడు. 'జడేజా సేవలను జట్టు కోల్పోతోంది. అతను ఉంటే ఏడు లేదంటే ఎనిమిదో స్థానం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హిట్టింగ్ ఆడుతాడు. భారీ షాట్లు కొడతాడు. అద్భుతమైన ఫీల్డర్. వికెట్లు పడగొట్టడం సరేసరి. నిజంగా అతని అమూల్యమైన సేవలను టీమిండియా మిస్సవుతోంది'' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

జస్ట్ ప్రయోగమే..
మెరుగైన రికార్డు కలిగిన కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలనే ఉద్దేశంతోనే రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించామని రోహిత్ శర్మ తెలిపాడు. కరోనా కారణంగా శిఖర్ ధావన్ సేవలను కోల్పోయిన నేపథ్యంలో కొత్తగా ఈ ప్రయోగం చేశామని చెప్పాడు. అయితే ఇది పర్మనెంట్ కాదనీ, తదుపరి వన్డేకు శిఖర్ థావన్ అందుబాటులోకి వస్తే పంత్ తన ఐదో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. 'ఏదైనా కొత్తగా చేద్దామనే ఉద్దేశంతోనే రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాం. అయితే ఇది శాశ్వతం కాదు. తదుపరి వన్డేకు శిఖర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అతనికి కొంచెం గేమ్ టైమ్ అవసరం. ఫలితాలను ఆశించి ఇలాంటి ప్రయోగాలు చేయం. లాంగ్ టర్మ్ గోల్స్‌ను దృష్టిలో పెట్టుకొనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఈ విధానంలో కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు ఎదురవ్వచ్చు.

పంత్ విఫలమైనా..
బుధవారం జరిగిన రెండో వన్డే 44 రన్స్ తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. శక్రవారం చివరి వన్డే జరుగుతుంది.


Click it and Unblock the Notifications
