Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధావన్ విజయవంతం కావడం సంతోషం.. అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయి'

Sunil Gavaskar says Good to see Shikhar Dhawan forget talk around his age

పూణే: టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ఫామ్‌లోకి రావడం సంతోషకరమని క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో గబ్బర్ వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయన్నారు. తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని సన్నీ ప్రశంసించారు. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఎమ్‌సీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ధావన్‌ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అద్భుతంగా ఆడిన ధావన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

విమర్శలన్నీ కొట్టుకుపోయాయి:

విమర్శలన్నీ కొట్టుకుపోయాయి:

మంగళవారం స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'నిజమే.. శిఖర్‌ ధావన్ వయసుపై చాలా చర్చ జరిగింది. అతనికిప్పుడు 35 ఏళ్లు. డిసెంబర్ మాసంలో 36వ వసంతంలోకి అడుగుపెడతాడు. మరి 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ధావన్ ఉంటాడా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి గబ్బర్ తన ఆటపై దృష్టిపెట్టడం, పరుగులు చేయడం సంతోషకరం. రోహిత్‌ శర్మతో కలిసి ధావన్‌ విధ్వంసకరమైన భాగస్వామ్యాలు ఇచ్చాడు. జట్టుకు ఎన్నోసార్లు మేలు చేశాడు' అని అన్నారు.

 జట్టు మనిషైన ధావన్‌:

జట్టు మనిషైన ధావన్‌:

'క్రిజులో ఎక్కువ సమయం గడపడం, బంతిని చక్కగా మిడిల్‌ చేయడంతో శిఖర్ ధావన్‌ ఆత్మవిశ్వాసం పెరిగింది. అందువల్లే 11 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు. రోహిత్‌ ఎప్పటిలా బాగా ఆడలేకపోయాడు. అందుకే ధావన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నాడు. కొన్ని షాట్లు ఆడాక అతడిలో మంచి ఆత్మవిశ్వాసం కనిపించింది. ఆ తర్వాత తన సామర్థ్యం మేరకు షాట్లు ఆడాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా బాదిన సిక్సర్‌ సూపర్. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అన్నట్టు జట్టు మనిషైన ధావన్‌ విజయవంతం కావడం సంతోషకరం' అని సన్నీ పేర్కొన్నారు.

 ధావన్‌పై కోహ్లీ ప్రశంసలు:

ధావన్‌పై కోహ్లీ ప్రశంసలు:

కీలక పరుగులు చేసిన శిఖర్ ధావన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 'మేం ఇంతకు ముందే చెప్పాం. కసితో ఉండే ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం. ధావన్‌ ఇన్నింగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పరుగులు చేసేవాళ్లు, నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకు మేం కచ్చితంగా అవకాశాలు ఇస్తాం. తుది జట్టులో చోటు దొరకనప్పుడూ ధావన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అతడి దేహభాష చాలా బాగుంది. మాకెంతో సహాయకారిగా ఉన్నాడు. ఈరోజు ఫలితానికి గబ్బర్ అర్హుడు. మ్యాచ్‌లో సంక్లిష్టమైన దశలో అతడు ఆడాడు. గబ్బర్ చేసిన 98 పరుగులు స్కోరు బోర్డులో కనిపించేవాటి కన్నా ఎంతో విలువైనవి' అని విరాట్ అన్నాడు.

తృటిలో సెంచరీ మిస్:

తృటిలో సెంచరీ మిస్:

ఇటీవల ముగిసిన టీ20ల్లో నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన శిఖర్ ధావన్‌పై తొలి వన్డేలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదీకాకుండా ఇంగ్లండ్ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్తులో బంతులు విసిరి స్వింగ్‌ చేశారు. ఈ క్రమంలో నిలకడగా ఆడిన గబ్బర్‌ 98 పరుగులు సాధించాడు. రోహిత్, కోహ్లీ, ఇయ్యర్ పెవిలియన్ చేరినా.. క్రీజులో నిలబడి పరుగులు చేశాడు. అయితే 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ స్లో బంతిని పుల్ షాట్ ఆడబోయి.. షార్ట్ మిడ్ వికెట్‌లో ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్‌గా చిక్కాడు. దీంతో తృటిలో సెంచరీ కోల్పోయాడు.

IPL 2021: ఆర్‌సీబీకి షాక్.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు స్టార్ స్పిన్నర్ దూరం!!

Story first published: Wednesday, March 24, 2021, 16:55 [IST]
Other articles published on Mar 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+