
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి భారీ షాక్ తగిలింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరగనుండగా.. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఆస్ట్రేలియా యువ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఏప్రిల్ రెండో వారంలో జంపా పెళ్లి జరగనుంది. దీంతో ఐపీఎల్ 2021లో బెంగళూరు ఆడే తొలి మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ ధృవీకరించారు. ఐపీఎల్ 2020లో బెంగళూరు తరఫున 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జంపా.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020 తర్వాత అతడు నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబర్చాడు.
ఆడమ్ జంపా ఆస్ట్రేలియా తరపున 61 వన్డేల్లో 92 వికెట్లు, 41 టీ20ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయాన్ జట్టులో ఉండడంతో.. జంపా ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడం అతడి శైలి. ఇక 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్ 2021 కోసం మార్చి 29 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించబోతోందని మైక్ హసన్ చెప్పారు. క్యాంప్‌కి ఒక్కరోజు ముందు భారత్‌కి సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ రాబోతున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1-2లోపు విదేశీ క్రికెటర్లు కూడా క్యాంప్‌లో చేరుతారని పేర్కొన్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో బెంగళూరు ప్లేఆఫ్‌లో నిష్క్రమించిన విషయం తెలిసిందే. లీగ్ మ్యాచులలో అద్భుతంగా ఆడిన కోహ్లీసేన ప్లేఆఫ్‌లో పేలవ ఆటతో మూల్యం చెల్లించుకుంది.
'ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు.. వికెట్లను అధ్యయనం చేసి బ్యాటింగ్ విభాగానికి వివరిస్తా'
https://telugu.mykhel.com/cricket/shikhar-dhawan-said-i-know-how-to-handle-pressure-nicely-in-international-cricket/articlecontent-pf58052-033914.html