'ఇంగ్లిష్ పిచ్‌లపై హిట్‌మ్యాన్ చెలరేగుతాడు.. 2019 ప్రపంచకప్ ప్రదర్శనను పునరావృతం చేస్తాడు'

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తాడని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ ప్రదర్శనను రోహిత్ మరోసారి పునరావృతం చేస్తాడన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో అతడు భారీ స్థాయిలో పరుగులు చేస్తాడని సన్నీ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లిష్ పిచ్‌లపై రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను బాగా మార్చుకున్నాడన్నాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆగష్టు 4 నుంచి ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఆ ప్రదర్శనను పునరావృతం చేస్తాడు
తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు శతకాలు చేయడం మనం చూశాం. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన శతకం చేశాడు. కఠినమైన పిచ్, చల్లని వాతావరణంలో బాగా ఆడాడు. పరిస్థితులకు తగ్గట్టుగా టెక్నిక్‌ను మార్చుకున్నాడు. ఈ రెండేళ్లలో రోహిత్ మరింత అనుభవం సంపాదించాడు. ఈ టెస్టు సిరీసులో అతడు అలాంటి ప్రదర్శనే పునరావృతం చేస్తే.. నాకేమీ ఆశ్చర్యం లేదు. కచ్చితంగా భారీ స్థాయిలో పరుగులు చేస్తాడు' అని అన్నాడు.

122 బంతుల్లోనే 144 పరుగులు
2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు శతకాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాపై 122 నాటౌట్, మాంచెస్టర్‌లో పాక్‌పై 140, బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై 102, బర్మింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్‌పై 104, లీడ్స్‌లో శ్రీలంకపై 103 పరుగులు చేశాడు. సఫారీలపై సౌథాంప్టన్‌లో 122 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. ఇందులో 13 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక త్వరలో జరిగే ఐదు టెస్టుల సిరీసులో రోహిత్ కీలకం కానున్నాడు. ఓపెనర్‌గా అతడు చేసే పరుగులే జట్టుకు కీలకం కానున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ అతడు శుభారంభమే అందించాడు.
IPL 2021: ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త.. మహీకి ఇదే చివరి ఐపీఎల్ కాదు!!

ఫ్యామిలీతో ఎంజాయ్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం యూకే వెళ్లిన కోహ్లీసేన.. ప్రస్తుతం బయో బబుల్ వీడి ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమిండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు.

ఆ ముద్రను చెరపేసుకోవాలని
విరామం అనంతరం టీమిండియా ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2021-23కు సంబంధించిన టెస్టు చాంపియన్‌షిప్ ఈ సిరీస్‌తోనే ప్రారంభంకానుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో అంచనాలను అందుకోలేకపోయిన రోహిత్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా రాణించాలని భావిస్తున్నాడు. స్వదేశంలో మాత్రమే ఆడగలడనే ముద్రను చెరపేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ 39 టెస్టుల్లో 2679 రన్స్ చేశాడు. 7 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications