For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త.. మహీకి ఇదే చివరి ఐపీఎల్ కాదు!!

Ms Dhoni Will Continue As Chennai Super Kings Captain For Next Two IPL Says CSK CEO

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. గతేడాది ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు చాలా నిరుత్సాహపపడ్డారు. టీ20 ప్రపంచకప్ ఆడితే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా మహీ ఆటను చూడొచ్చని అభిమానులు ముచ్చటపడ్డారు. అయితే ధోనీకి ఐపీఎల్ 2021 చివరి సీజ‌న్ కావ‌చ్చ‌న్న వార్త‌లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ ఈ వార్తలకు చెక్ పెట్టారు. ధోనీకి ఇదే చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ కాద‌ని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. 'ఎంఎస్ ధోనీ మరో ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టులో కొనసాగవచ్చు. మహీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. కఠిన సాధన చేస్తున్నాడు. ధోనీ ఆట కొనసాగించలేడని అనుకోవడానికి ఎటువంటి కారణం కనబడడం లేదు. మరో రెండేళ్లపాటు ఆడగలడు. చెన్నై కోసం అతడు ఏం చేశాడో తెలుసు. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మహీ అనుభవజ్ఞుడైన ఆటగాడు, మంచి కెప్టెన్. అంతేకాదు గొప్ప ఫినిషర్‌ కూడా. మంచి వ్యక్తి. ఈ బాధ్యతలను అన్నింటిని చక్కగా నిర్వర్తిస్తున్నాడు' అని విశ్వ‌నాథ‌న్ అన్నారు.

ఎంఎస్ ధోనీ సీఎస్‌కేకు మూడు ఐపీఎల్‌ ట్రోఫీలు (2010, 2011, 2018) అందించాడు. తన కూల్ కెప్టెన్సీతో మెగా టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. 2020లో మెరుగైన ప్రదర్శన చేయని చెన్నై.. 2021లో మాత్రం మళ్లీ పుంజుకుంది. లీగ్ నిలిచిపోయేసమయానికి 7 మ్యాచుల్లో 5 విజయలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంది. మహీ ఐపీఎల్ టోర్నీలో 211 మ్యాచులు ఆడి 4669 రన్స్ చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే గతేడాది మినహా ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2008 అరంగేట్ర సీజన్ నుంచి 2019 సీజన్ వరకు చెన్నై జైత్రయాత్ర అప్రతహితంగా సాగింది. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017లో బ్యాన్‌కు గురైంది. ఈ రెండు సీజన్లు మినహా 2019 వరకు ఆడిన ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇందులో 2010, 2011, 2018 టైటిల్స్ గెలిచిన ధోనీ సేన.. 2008, 2012, 2013, 2015, 2019 ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2009లో సెమీస్‌కే పరిమితమైన చెన్నై.. 2014 ప్లే ఆఫ్స్‌కు మాత్రమే పరిమితమైంది. ఇలా వరుసగా 10 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరడం ఏ జట్టుకు సాధ్యం కాకపోవచ్చు.

Story first published: Thursday, July 8, 2021, 13:04 [IST]
Other articles published on Jul 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+