For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: డేవిడ్ వార్నర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయ్!

Sunil Gavaskar says David Warner will be one of most-wanted players at IPL 2022 auction
David Warner : SRH ముఖచిత్రం ఏంటో | IPL 2022 Auction అసలు మజా || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ 2021లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ కోసం ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడతాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఈ వేలంలో జట్లు ఎక్కువగా కోరుకునే ఆటగాళ్ల జాబితాలో అతను ముందు వరుసలో ఉంటాడని ఈ భారత దిగ్గజం అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది రెండు దశల్లో జరిగిన ఐపీఎల్‌ల్లో డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు.

దాంతో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. చివరకు టీమ్ డగౌట్‌లోకి కూడా అతనికి అవకాశం దక్కలేదు. అతని ఫామ్ కంటే ఇతర కారణాలతో జట్టుకు దూరమైనట్లు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం లేదు. వార్నర్ సైతం ఈ విషయాన్ని ఎప్పుడో వెల్లడించాడు.

డేవిడ్ వార్నర్‌కు ఫుల్ డిమాండ్..

డేవిడ్ వార్నర్‌కు ఫుల్ డిమాండ్..

ఈ క్రమంలోనే వచ్చే సీజన్ కోసం నిర్వహించే మెగా వేలంలో వార్నర్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రిటైన్ చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నాడు. అతని పట్ల టీమ్‌మేనేజ్‌మెంట్ దారుణంగా వ్యవహరించిందన్నాడు. 'వేలంలో కచ్చితంగా ఫ్రాంఛైజీలు కోరుకునే ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్‌ ముందు వరుసలో ఉంటాడు.

రెండు కొత్త జట్లు కూడా వేలంలో ఉన్నాయి కాబట్టి, కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంతో అనుభవమున్న అతను ఈ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడు. రెండు కొత్త జట్లతో పాటు ఇతర ఫ్రాంఛైజీలు కూడా అతని కోసం తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది.

దారుణంగా ప్రవర్తించారు..

దారుణంగా ప్రవర్తించారు..

ఎందుకంటే సన్‌రైజర్స్‌ అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం కనిపించడం లేదు. గత ఐపీఎల్‌ సందర్భంగా సాధారణ ఆటగాళ్లు కూడా జట్టుతో పాటు వచ్చినప్పుడు వార్నర్‌ను హోటల్‌కే పరిమితం చేయడం సరికాదు. అతని ఫామ్‌ కంటే కూడా ఇతర కారణాలేవో దాని వెనక ఉండొచ్చు. కానీ తనపై నమ్మకాన్ని కోల్పోని వార్నర్‌ సానుకూల దృక్పథంతో ప్రపంచకప్‌లో ఆడాడు. గతంలో జరిగింది మర్చిపోయి కేవలం భవిష్యత్‌ మీదే దృష్టి పెట్టాలని అతను అనుకుని చెలరేగి ఉంటాడు'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

టైటిల్ అందించినా..

టైటిల్ అందించినా..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘకాలం నుంచి ఆడుతున్న వార్నర్.. 2016‌లో ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు. ప్రతీ సీజన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన వార్నర్.. ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు దశల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. చివరకు టీమ్ డగౌట్‌లోకి కూడా అతన్ని అనుమతించకుండా సన్‌రైజర్స్ అవమానించింది.

వార్నర్‌ స్థానంలో కేన్ విలియమ్సన్ సారథ్య బాధ్యతలు చేపట్టినా సన్‌రైజర్స్ తలరాత మాత్రం మారలేదు. సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతో ముగించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో డేవిడ్ వార్నర్‌ ఉంటాడా? లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. వార్నర్ సైతం సన్‌రైజర్స్‌కు ఆడాలని ఉన్నా.. తనని రిటైన్ చేసుకుంటుందని అనుకోవడం లేదని చెప్పాడు.

సూపర్ బ్యాటింగ్‌‌తో..

సూపర్ బ్యాటింగ్‌‌తో..

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ‌తో టచ్‌లోకి వచ్చిన వార్నర్ తన ఫామ్‌ను ఫైనల్ వరకు కొనసాగించాడు. అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి విమర్శకులు ముక్కున వేలు వేసుకునేలా చేశాడు. ఇందులో (65, 89 నాటౌట్, 49, 53) నాలుగు విన్నింగ్ నాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో వార్నర్ ఆడిన తీరు.. సెమీస్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పయినా తీవ్ర ఒత్తిడిలో స్వేచ్చగా ఆడిన విధానం అతని కెరీర్‌లోనే హైలైట్.

Story first published: Tuesday, November 16, 2021, 13:00 [IST]
Other articles published on Nov 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+