For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా అయితే బాబర్ ఆజామ్ పాక్ ప్రధాని అవుతాడు.. 1992 సెంటిమెంట్‌పై గవాస్కర్ ఎటకారం!

Sunil Gavaskar says Babar Azam will become Pakistans Prime Minister in 2048

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్ విజయం సాధిస్తే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ పాకిస్థాన్ ప్రధాని అవుతాడని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. పాక్ 1992 సెంటిమెంట్‌పై స్పందిస్తూ గవాస్కర్ సెటైర్లు పేల్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగానే జరగడం, అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాక్ చేరుకోవడం ఆ జట్టు అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. దాంతో భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందే 1992 సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ఇంగ్లండ్ చేతిలో ఇండియా ఓడుతుందని పాక్ అభిమానులు జోస్యం చెప్పారు. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు సహచర కామెంటేటర్లు గవాస్కర్ ముందు ఈ 1992 సెంటిమెంట్ ప్రస్తావించారు.

ఇక గవాస్కర్ స్పందిస్తూ.. 'పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ గెలిస్తే 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడు' అని చెప్పగా.. పక్కన ఉన్న షేన్ వాట్సాన్, మైఖేల్ ఎర్త్‌టన్ పగలపడి నవ్వారు. ఈ సెంటిమెంట్‌లు పనిచేయవనే ఉద్దేశంతో గవాస్కర్ ఇలా సెటైర్లు పేల్చాడు. 1992 ప్రపంచకప్‌లో పాక్ జట్టును ఇమ్రాన్ ఖాన్ టైటిల్ నడిపించగా.. ఆయన 2018లో పాకిస్థాన్ ప్రధాని అయ్యారు. దాంతో పాక్ టైటిల్ గెలిస్తే బాబర్ 2048లో ప్రధాని అవుతాడని చెప్పాడు.

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించే స్థాయి నుంచి పాకిస్థాన్ ఏకంగా ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి.. ఫైనల్‌కు బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగే చివరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. 2009లో టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ గెలుచుకోగా.. 2010లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఏ జట్టు గెలిచినా.. రెండోసారి పొట్టికప్పును ముద్దాడినట్లు అవుతుంది.

Story first published: Saturday, November 12, 2022, 8:00 [IST]
Other articles published on Nov 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+