అజాత శత్రువు అజింక్యా రహానే.. అయినా అతనికి అన్యాయమే: సునీల్ గవాస్కర్
టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్యా రహానేపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్‌లో అజింక్యా రహానే అజాత శత్రువని కొనియాడాడు. రహానే సగర్వంగా ఆట నుంచి నిష్క్రమించాడని కొనియాడాడు.
అయినా రహానేకు భారత క్రికెట్‌లో అన్యాయమే జరిగిందని, రావాల్సిన గుర్తింపు రాలేదని పేర్కొన్నాడు. ఇటీవల అజింక్యా రహానే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ రహానే భావోద్వేగానికి గురయ్యాడు.
అజింక్యా రహానేకు గుర్తింపు దక్కలేదు..
రహానే రిటైర్మెంట్‌పై తాజాగా స్పందించిన గవాస్కర్.. రాహుల్ ద్రవిడ్ తరహాలోనే అతని సారథ్యానికి తగిన గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డాడు. 'కెప్టెన్‌గా అజింక్యా రహానేకు అద్భుతమైన రికార్డ్ ఉంది. అతను 6 టెస్ట్‌లకు కెప్టెన్సీ చేస్తే.. నాలుగు విజయాలు సాధించాడు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోనూ భారత్ అద్భతమైన విజయాలు సాధించింది. కానీ అతనికి దక్కాల్సిన గుర్తింపు రాలేదు. అలాగే రహానే నాయకత్వానికి కూడా గుర్తింపు లభించలేదు. అయితే భారత క్రికెట్‌లో ఇది సర్వసాధారణం. జట్టు గెలిచినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనలను కొనియాడటం.. ఓడినప్పుడు మాత్రం కెప్టెన్, కోచ్‌లను నిందించడం సాధారణమే.
అజింక్యా అజాత శత్రువు..
2021 ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఆ తర్వాత కోచ్ రవిశాస్త్రితో కలిసి రహానే జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. ఆస్ట్రేలియాకు కంచుకోట లాంటి బ్రిస్బేన్ గబ్బా మైదానంలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందిచి సిరీస్ అందించాడు. వాస్తవానికి గబ్బా టెస్ట్‌కు స్టార్ ఆటగాళ్లంతా గాయాలు, వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకుండా పోయారు.
అయినా కుర్రాళ్లతో రహానే జట్టును అద్భుతంగా నడిపించి గొప్ప విజయాన్ని అందించాడు. రహానే నిస్వార్థమైన ఆటతీరుకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అతను సగర్వంగా ఆట నుంచి వైదొలిగాడు. ఆటలో ఒక్క శత్రువు కూడా లేని క్రికెటర్లు నాకు తెలిసి అరడజను కంటే తక్కువమందే ఉంటారు. వారిలో రహానే ఒకడు'అని గవాస్కర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

