Sunil Gavaskar: కేఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీనే టీమిండియా ఓటమికి కారణం!

జొహానెస్‌బర్గ్: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే రెండో టెస్టులో టీమిండియా ఓటమిపాలైందని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ టైమ్‌లో రాహుల్ ఫీల్డ్ సెటప్ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని విమర్శించాడు. అతని కెప్టెన్సీ వైఫల్యం సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ పనిని సులభం చేసిందని అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్ కూడా సౌతాఫ్రికా విజయానికి కలిసొచ్చిందన్నాడు. తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

రాహుల్ కెప్టెన్సీ వైఫల్యంతో..
‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా లేని ఒక టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడడం ఇదే తొలిసారి. టీమిండియాతో రెండో టెస్ట్ ఛేదనలో ఎల్గర్ చాలా సౌకర్యంగా కనిపించాడు. దీనికి తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహులే కారణం. అతని కెప్టెన్సీ వైఫల్యమే ఎల్గర్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఎల్గర్ సాధారణంగా బంతిని హుక్ చేయడు. కానీ అలాంటి బ్యాట్స్‌మన్‌కు డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదు. ఈ లోపాన్ని ఉపయోగించుకుని డీన్ సులభంగా సింగిల్స్ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడు'' అని గవాస్కర్ వివరించాడు.

ఫీల్డింగ్ వైఫల్యం..
సౌతాఫ్రికాతో పోలిస్తే ఫీల్డింగ్‌లో భారత్ పదును లోపించిందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ‘భారత ఫీల్డింగ్ మరింత పదునుగా ఉండాల్సింది. సౌతాఫ్రికా విజయంలో వారి ఫీల్డింగ్ కూడా కీలకమైంది. భారత బౌలర్లు సైతం తేలిపోయారు. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.'' అని గవాస్కర్ తెలిపాడు. ఇక హాఫ్ సెంచరీలతో రాణించిన టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

పుజారా,రహానేకు అండగా ఉండాలి..
'పుజారా, రహానే ఇద్దరికీ ఉన్న అనుభవం, గతంలో జట్టుకు అందించిన విజయాల నేపథ్యంలోనే టీమ్‌మేనేజ్‌మెంట్ వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించింది. అవసరమైన వేళ వారిద్దరూ రాణిస్తారనే నమ్మకం ఉంచింది. అందుకు తగ్గట్టే రెండో ఇన్నింగ్స్‌లో రాణించి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
కొన్నిసార్లు మనం సీనియర్ల పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్‌బెంచ్‌లో పలువురు నైపుణ్యమున్న యువకులు తమ అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఎలా ఆడతారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ సీనియర్లు ఇద్దరూ మరీ ఘోరంగా విఫలమవ్వనంతకాలం.. జట్టు అండగా ఉంటూ ఇలాగే నమ్మకం ఉంచాలని నేను అనుకుంటున్నా' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

జస్ట్ మిస్..
సౌతాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయం.. టీమిండియాకు చిక్కినట్లే చిక్కి చేజారింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా గురువారం ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 240 పరుగుల లక్ష్యఛేదనలో విజయం కోసం మరో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆట కొనసాగించిన సఫారీ టీమ్ 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డీన్ ఎల్గర్ (188 బంతుల్లో 10 ఫోర్లతో 96 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...వాన్ డర్ డసెన్ (40), టెంబా బవుమా (23 నాటౌట్) అతనికి అండగా నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications