Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాతో తొలి వన్డే గెలిస్తే టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar reckons Hardik Pandya can lead Team India after 2023 ODI World Cup

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌కు సిద్దమైంది. శుక్రవారం ముంబై వేదికగా జరిగే తొలి వన్డేలో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానుండగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. అయితే తొలి వన్డేలో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పేరు మారుమోగుతుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యా అందుకుంటాడని జోస్యం చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్‌లో షోలో పాల్గొన్న గవాస్కర్.. టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడని చెప్పాడు.

'హార్దిక్ పాండ్యా తన సారథ్యంతో ఆకట్టుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అతని కెప్టెన్సీకి నేను ఫిదా అయ్యాను. గుజరాత్ టైటాన్స్, టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. ముంబైలో తొలి వన్డేలో విజయం సాధిస్తే వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం భారత కెప్టెన్‌‌గా అతని పేరు బలంగా వినిపిస్తోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆటగాళ్ల సౌకర్యంగా ఉండటం కనిపించింది. అతను ఆటగాళ్లను హ్యాండిల్ చేసే విధానం, వారికి అండగా ఉండటం ఆటగాళ్లు సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. దాంతో ఆటగాళ్లు తమ సహజిసిద్దమైన ఆటను ఆడుతున్నారు. నాకు తెలిసి సహచర ఆటగాళ్లను హార్దిక్ ప్రోత్సహిస్తున్నాడు. ఇది జట్టుకు శుభసూచకం.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2022 సీజన్ ముందు వరకు గాయాలతో సతమతమైన హార్దిక్ పాండ్యా.. స్వచ్చందగా జట్టు నుంచి తప్పుకొని ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపాడు. బ్యాటింగ్‌లో అప్‌ది ఆర్డర్ ఆడిన పాండ్యా.. జట్టుకు కావాల్సిన ఇన్నింగ్స్‌లు ఆడాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటి కెప్టెన్‌గా గుజరాత్‌కు తొలి టైటిల్ అందించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా వైస్ కెప్టెన్సీతో పాటు టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఇప్పుడు వన్డే సారథ్యాన్ని కూడా స్వీకరించనున్నాడు.

Story first published: Wednesday, March 15, 2023, 14:42 [IST]
Other articles published on Mar 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+