Sunil Gavaskar: చరిత్ర సృష్టించడానికి టీమిండియాకు ఇదే లక్కీ చాన్స్!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టుకు టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే సువర్ణవకాశమని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత జట్టు ఇటీవల విదేశీ పిచ్‌లపై మెరుగ్గా రాణిస్తోందని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో చేసిన ప్రదర్శనే అందుకు నిదర్శనమని చెప్పాడు. ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవని భారత్.. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ మీడియా చానెల్‌తో మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే ఆకాశమే హద్దవుతుందన్నాడు. సౌతాఫ్రికా జట్టు బలహీనంగా ఉందని, ఇదే మంచి చాన్సన్నాడు.

ఇదే మంచి చాన్స్..
'ఇప్పటి వరకు టీమిండియా ఏడు సార్లు సౌతాఫ్రికాలో పర్యటించినా.. ఒక్క సారి కూడా సిరీస్ సాధించలేకపోయింది. త్వరలో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు విజయం సాధిస్తే ఆకాశమే హద్దు అవుతుంది.సౌతాఫ్రికాలో సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఇప్పటికే టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉంది.
ఏబీ డి విలియర్స్, డు ప్లెసిస్, హాషీమ్ ఆమ్లా వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో సౌతాఫ్రికా జట్టు బలహీనమైంది. మరోవైపు, క్వింటన్ డి కాక్ కూడా తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఇవన్నీ భారత్‌కు కలిసొచ్చే అంశాలే. అందుకే సౌతాఫ్రికాలో సిరీస్ గెలిచేందుకు ఇదే సువర్ణావకాశం' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

50-60 పరుగులు చేసినా..
'గత కొద్ది కాలంగా సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో తడబడుతోంది. అందుకే విజయం కోసం ఎక్కువగా బౌలర్లపైనే ఆధారపడుతోంది. సీనియర్ల రిటైర్మెంట్‌తో సఫారీల బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉన్నా.. పేస్ దళం మాత్రం బలంగానే కనిపిస్తోంది. వారి నుంచి టీమిండియాకు ప్రతిఘటన ఎదురుకావొచ్చు.
అయితే, భారత జట్టులో 7, 8, 9వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి రాణించగల టెయిలెండర్లు ఉండటం సానుకూలాంశం. ఆఖర్లో వాళ్లు 50-60 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉంటుంది' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే తొలి విదేశీ పర్యటన కావడంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాక్సిండే టెస్ట్..
డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ) ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications