Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ సేన సుడి బాగుంది.. రాసిపెట్టుకోండి టీ20 ప్రపంచకప్ మనదే: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar Predicts Rohit Sharma led India can win T20 World Cup 2022

న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలుస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. మెగా టోర్నీల్లో విజేతగా నిలవాంటే ఆయా జట్లకు కావాల్సినంత లక్ రోహిత్ సేనకు ఉందన్నాడు. ఈ సారి రోహిత్ అండ్ కో సుడి బాగుందని, కచ్చితంగా టైటిల్‌తో తిరిగివస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. మెగాటోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై వస్తున్న విమర్శలపై కూడా గవాస్కర్ స్పందించాడు. సెలక్టర్లు ఒకసారి జట్టును ఎంపిక చేస్తే అందులో తప్పులు వెతకాల్సిన పన్లేదని.. జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించాడు.

విమర్శలు సరికావంటూ..

విమర్శలు సరికావంటూ..

ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మహ్మద్ షమీ, సంజూ శాంసన్‌లకు అవకాశం ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. షమీని స్టాండ్ బై ప్లేయర్ గా కాకుండా 15మంది సభ్యులతో పాటు ఎంపిక చేస్తే బాగుండేదని.. అంతేగాక టీ20లలో సరిగా రాణించని రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకుని ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన గవాస్కర్ ఈ విమర్శలపై స్పందించాడు.

 ఒక్కసారి ఎంపిక చేస్తే..

ఒక్కసారి ఎంపిక చేస్తే..

'టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు.. టైటిల్‌తోనే తిరిగి వస్తుందని నేను నమ్ముతున్నాను. రోహిత్ అండ్ కో‌కు ప్రతి జట్టుకు ఉండాల్సిన కాస్తంత అదృష్టం కూడా ఉంది. ఒకసారి జట్టును ఎంపిక చేసినాక ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే అది మన టీమిండియానే. ఆ జట్టుకు మనం మద్దతుగా నిలవాలి. జట్టులో ఎంపికలు, పక్కనపెట్టేవారి గురించి మాట్లాడితే ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతింటుంది.'గవాస్కర్ పేర్కొన్నాడు.

నేనే సెలెక్టర్ అయితే..

నేనే సెలెక్టర్ అయితే..

జట్టు ఎంపిక గురించిన మాట్లాడిన మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్‌ తాను మాత్రం జట్టులో షమీతో పాటు ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్‌ను తీసుకునేవాడినని చెప్పాడు. 'ప్రస్తుత జట్టును నేను ఎంపిక చేయాల్సి వస్తే.. మహ్మద్ షమీ తో పాటు ఉమ్రాన్ మాలిక్, శుభమన్ గిల్‌లను కూడా ఎంపిక చేసేవాడిని. ఈ ముగ్గురూ ఐపీఎల్‌లో బాగా ఆడారు.'అని తెలిపాడు.

మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్ధీన్ సైతం టీమ్ ఎంపికను తప్పుబట్టాడు. 'టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టును చూసి ఆశ్చర్యానికి గురయ్యా. మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్‌లు ప్రధాన టీమ్‌లో ఉండాల్సినవాళ్లు. దీపక్ హుడా, హర్షల్ పటేల్‌ల స్థానాల్లో వారిని ఎంపిక చేసి ఉండాల్సింది.'అని వ్యాఖ్యానించాడు.

Story first published: Thursday, September 15, 2022, 15:18 [IST]
Other articles published on Sep 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+