క్రికెట్‌కు ఇది అత్యంత దుర్దినం: సునీల్ గవాస్కర్
వెస్టిండీస్ కెప్టెన్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందారు. మరో 11 రోజులైతే సోబర్స్ 90వ జన్మదినం జరుపుకునేవారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా సర్ గ్యారీ సోబర్స్ గుర్తింపు పొందారు.
1954-74 మధ్య వెస్టిండీస్ తరఫున 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ బ్యాటర్ 57.78 సగటుతో 8,032 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలతో పాటు 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1958లో పాకిస్థాన్‌పై టెస్ట్ మ్యాచ్‌లో 365 పరుగులతో అజేయంగా నిలిచాడు. 36 ఏళ్ల పాటు ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది.
1994లో బ్రియాన్ లారా 375 పరుగులు చేసి ఈ రికార్డ్‌ను అధిగమించాడు. 39 టెస్ట్‌ల్లో వెస్టిండీస్‌కు సారథ్యం వహించిన సోబర్స్.. 9 విజయాలు అందించి 20 టెస్ట్‌లు డ్రా చేశాడు. మరో 10 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ ఓటమిపాలైంది.

ఆయన అకాల మరణం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. క్రికెట్‌కు ఇది అత్యంత దుర్దినమని తెలిపాడు. 'ప్రపంచంలోనే అత్యంత గొప్ప క్రికెటర్ ఇక లేరు. క్రికెట్‌కు ఇది అత్యంత చెడు రోజు. సోబర్స్ గొపతనాన్ని మాటల్లో వర్ణించలేం. మా చిన్నప్పుడు బ్యాట్, బంతి పట్టుకున్న ఏ క్రికెటర్‌కైనా సోబర్స్ ఆదర్శం. ఆయనను తలచుకుంటే ఎన్నో జ్ఞాపకాలు నా కళ్ల ముందు మెదులుతున్నాయి. వాటిని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను.'అని సునీల్ గవాస్కర్ ఓ వీడియోలో పేర్కొన్నాడు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా నివాళులర్పించారు. 'సోబర్ నైపుణ్యం తమ ప్రతిభను అంచనా వేయడానికి కొలమానంగా ఉండేది. అత్యంత అరుదైన ప్రతిభావంతుడు'అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఆల్‌రౌండర్లకు సోబర్స్ ఒక ప్రమాణాన్ని నెలకొల్పాడని భారత మాజీ ఆల్‌రౌండర్ మదన్‌లాల్ అన్నాడు. తన బౌలింగ్‌లో దూకుడుగా ఆడేవాడని మాజీ స్పిన్నర్ చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

