ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్లు నన్ను 'గెట్ లాస్ట్' అన్నారు.. అందుకే అలా చేశా: గవాస్కర్

మెల్‌బోర్న్ : టీమిండియా మాజీ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా ఆటగాళ్లతో జరిగిన ఒక చేదు అనుభవాన్ని తాజాగా పంచుకున్నాడు. 1981లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గవాస్కర్.. అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల వెనుదిరగాల్సి వచ్చింది. అయితే వెళ్తూ వెళ్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చేతన్ చౌహాన్‌ను కూడా సన్నీ తీసుకొని వెళ్లడం వివాదానికి కారణమైంది. మ్యాచ్ నుంచి వాక్ ఆఫ్ చేస్తున్నట్లు గవాస్కర్ చెప్పడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే ఆ వివాదానికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగిందో ఇన్నాళ్లకు లిటిల్ మాస్టర్ వెల్లడించాడు.

అంపైర్ నిర్ణయం మారలేదు:
1981 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో.. ఆసీస్ పేసర్ డెనిస్ లిల్లీ బౌలింగ్‌లో సునీల్ గవాస్కర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలిందంటూ సన్నీ చెప్పినా.. అంపైర్ నిర్ణయం మారలేదు. దీంతో అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ వెంటనే చేతన్ చౌహాన్‌ను తీసుకొని బయటకు వెళ్లిపోవడానికి సన్నీ ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు. తాజాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ డేమియన్ ప్లెమింగ్‌తో జరిగిన సంభాషణలో గవాస్కర్ ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు.

గెట్ లాస్ట్ అన్నారు:
'డెనిస్ లిల్లీ బౌలింగ్‌లో అంపైర్ ఇచ్చిన ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై నేను తీవ్ర నిరాశకు గురయ్యా. బంతి ప్యాడ్‌కు తగలకుముందే బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. కానీ అంపైర్ ఎల్బీగా నిర్ణయించాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న క్రమంలో ఆస్ట్రేలియన్లు రెచ్చగొట్టారు. గెట్ లాస్ట్ అన్నారు. దీంతో నేను చేతన్‌తో.. ఇద్దరం కలిసి మైదానాన్ని వీడదామని అన్నాను' అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. అయితే తనతో పాటు మైదానాన్ని వీడాలని చెప్పడంతో చౌహన్ షాకయ్యాడని తెలిపాడు. 'నిజంగానే అంటున్నావా' అని అడిగాడని పేర్కొన్నాడు.

కిర్మాణి అలా అనడంతో:
అంతకుముందు రోజు ఆటలో జరిగిన ఓ సంఘటనతో తన మైండ్‌లో ఆ ఆలోచన వచ్చిందని లిటిల్ మాస్టర్ చెప్పాడు. 'అంతకుముందు రోజు ఆటలో అలెన్ బోర్డర్ ఔట్ అంటూ మూడు సార్లు అప్పీల్ చేశాం. బోర్డర్ శతకం సాధించిన తర్వాత అప్పీల్ చేసినప్పుడు అంపైర్, స్క్వేర్‌లెగ్ అంపైర్.. ఔటా? నాటౌటా? అని చర్చించారు. ఆ సమయంలో వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి.. ఈ సారి కూడా ఔట్ ఇవ్వకపోతే నేను మైదానాన్ని విడిచి వెళ్లిపోతా అని అన్నాడు. దాంతో తర్వాత రోజు నేను ఔటైనప్పుడు.. మైదానాన్ని విడిచిపోవాలి అనే మాట నా మైండ్‌లో తిరిగింది' అని సన్నీ చెప్పాడు.

తొలి వికెట్‌కు 165 పరుగులు:
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో ముగించింది. తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 324 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గవాస్కర్ (70), చేతన్ (85) తొలి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వెంగ్‌సర్కార్ (41) కూడా రాణించడంతో ఆసీస్‌కు టీమిండియా 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 83 పరుగులకే ఆలౌట్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సౌరవ్ గంగూలీ కోసం నగ్మా ప్రార్థనలు!!