సౌరవ్ గంగూలీ కోసం నగ్మా ప్రార్థనలు!!

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాదా కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గంగూలీ ఈరోజు ఉదయం వ్యాయామం చేస్తుండగా ఛాతిలో నొప్పితో అసౌకర్యానికి గురయ్యారు. స్వల్పస్థాయి గుండెపోటు రావడంతో 48 ఏళ్ల దాదా శనివారం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, సీసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సౌరవ్ గంగూలీ న్యూస్ ట్రెండ్ అవుతోంది. గంగూలీకి అస్వస్థత అని తెలియడంతో చాలా మంది ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. దాదా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా కూడా కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండ్ అవుతోంది.
'సౌరవ్ గంగూలీ.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. గెట్ వెల్ సూన్. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని సీనియర్ నటి నగ్మా ట్వీట్ చేశారు. యుక్త వయసులో బాలీవుడ్ హీరోను తలిపించే దాదాను అమ్మాయిలు తెగ ఇష్టపడేవారు. అప్పట్లో ఈ స్టార్ క్రికెటర్-నగ్మాల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనే పుకార్లు షికార్లు చేశాయి. అప్పుడు సోషల్ మీడియా, టీవీ చానెళ్లు ఇంతగా లేకపోవడంతో వీరీ ప్రేమాయాణంపై స్పష్టత రాలేదు. కానీ నగ్మాతో దాదా చాలా కాలం ఎఫైర్ సాగించడనేది అతని అభిమానుల నమ్మకం. ఇక ఈ ఇద్దరూ కొన్ని ఇంటర్వ్యూల్లో వీరీ ప్రేమాయణం గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని బోర్డు కార్యదర్శి జే షా వెల్లడించారు. తాను గంగూలీ కుటుంబంతో మాట్లాడానని, దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు జే షా ట్వీట్ చేశారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. ఐసీసీ కూడా స్పందించింది. గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్వీట్ చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టాండిన్ కెప్టెన్ అజింక్య రహానే కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు. 'గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలిసి బాధపడ్డాను. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దాదా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో గంగూలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా' అని సీఎం ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications