
మయాంక్ ఫెయిల్యూర్‌కి కారణం ఇదే
తాజాగా ఓ ఆస్ట్రేలియా మీడియాతో సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. 'మయాంక్ అగర్వాల్ తీసుకునే స్టాన్స్ కారణంగా అతనికి ఏమాత్రం బ్యాలెన్స్ దొరకడం లేదు. మయాంక్ కాళ్లని ఎడంగా ఉంచి స్టాన్స్ తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై బౌలర్లకి అదనపు బౌన్స్ లభిస్తున్న సమయంలో.. బ్యాట్స్‌మెన్ బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి ఆడాలి. కానీ మయాంక్ తీసుకుంటున్న స్టాన్స్ కారణంగా.. అతడు ఆ విధమైన షాట్లు ఆడడం కుదరట్లేదు. మయాంక్ ఎక్కువగా ఫ్రంట్ ఫుట్‌కి వెళ్లి ఆడే ప్రయత్నం చేస్తూ.. వికెట్ చేజార్చుకుంటున్నాడు. మయాంక్ స్టాన్స్ మార్చుకుంటే అతని ఆట మెరుగుపడుతుంది' అని సన్నీ సూచించారు.

రెండు టెస్టుల్లోనూ 31 పరుగులు
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 40 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్.. 17 పరుగుల వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 40 బంతులాడి 9 పరుగుల వద్ద జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండు టెస్టుల్లోనూ 31 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతని షాట్ సెలక్షన్‌తో పాటు ఫుట్ వర్క్ మెరుగ్గా లేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

రోహిత్ వస్తే
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తే.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారిలో ఒకరిపై కచ్చితంగా వేటుపడనుంది. అయితే రోహిత్ ఓపెనింగ్ చేస్తాడా? లేదా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడా? అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఆడతాడనేది జట్టు యాజమాన్యం ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. గిల్ ఆకట్టుకున్నాడు కాబట్టి మయాంక్ పైనే వేటుపడే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఇద్దరినీ బెంచ్‌కు పరిమితం చేయాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు. మరి కెప్టెన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications

స్టార్ ఆల్‌రౌండర్‌కి కరోనా.. ఆందోళనలో ఆటగాళ్లు!!