Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్‌ ఆల్‌రౌండర్‌కి కరోనా.. ఆందోళనలో ఆటగాళ్లు!!

England vs Sri Lanka: Moeen Ali tests positive for Coronavirus

కొలంబో: టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంకలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టులో కరోనా వైరస్‌ మహమ్మారి కలకలం రేపింది. గాలే వేదికగా జనవరి 14 నుంచి వరుసగా రెండు టెస్టుల సిరీస్‌ని ఆడేందుకు శ్రీలంకకి వెళ్లిన ఇంగ్లాండ్‌ జట్టు‌కి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి పాజిటివ్‌గా తేలింది. దాంతో విమాన ప్రయాణంలో అతనితో సన్నిహితంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ క్రిస్‌ వోక్స్‌‌‌ని కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

మొయిన్‌ అలీకి పాజిటివ్‌

మొయిన్‌ అలీకి పాజిటివ్‌

టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంకలోని హంబతోట ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్‌ జట్టు‌ ఆటగాళ్లందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో మొయిన్‌ అలీకి పాజిటివ్‌గా తేలిందని ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. అలీని 10 రోజుల క్వారంటైన్‌కి తరలించారు. అలానే అతనితో క్లోజ్‌గా ఉన్న క్రిస్ ‌వోక్స్‌ని మరోసారి వైరస్ పరీక్షలు నిర్వహించే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

అక్కడ నెగెటివ్.. ఇక్కడ పాజిటివ్

అక్కడ నెగెటివ్.. ఇక్కడ పాజిటివ్

ఇంగ్లాండ్‌ నుంచి లంకకు బయలుదేరేముందు ఆటగాళ్లందరికీ వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఫలితం కరోనా నెగెటివ్‌గా వచ్చింది. ఇంగ్లాండ్‌ టీమ్‌ ఆదివారమే లంకకు చేరుకున్నది. అయితే శ్రీలంకలోని హంబతోట ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత చేసిన పరీక్షలలో మొయిన్‌ అలీకి పాజిటివ్‌గా తేలడం విశేషం. లంక ప్రభుత్వ కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం అలీ 10 రోజుల పాటు సెల్ఫ్‌ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. అతనికి మూడు సార్లు వైరస్ పరీక్షలు చేస్తారు. అలీ మొదటి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మంగళవారం రెండోసారి వైరస్ పరీక్షలు

మంగళవారం రెండోసారి వైరస్ పరీక్షలు

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మంగళవారం ఉదయం రెండోసారి వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. క బుధవారం నుంచి ఇంగ్లీష్ జట్టు శిక్షణను ప్రారంభిస్తుంది. గాలె వేదికగానే శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు రెండు టెస్టులను ఆడనున్నాయి. జనవరి 26తో ఈ సిరీస్ ముగియనుంది. ఆ వెంటనే భారత్‌కి రానున్న ఇంగ్లాండ్ టీమ్.. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియాతో ఆడనుంది.

దక్షిణాఫ్రికాతో లంక టెస్ట్ సిరీస్

దక్షిణాఫ్రికాతో లంక టెస్ట్ సిరీస్

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో లంక టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైన ప్రొటీస్.. 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆట ఆఖరికి 150 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. కేవలం ఐదు పరుగుల ఆధిక్యంలో ఉన్న లంక చేతిలో ఆరు వికెట్లున్నాయి. కెప్టెన్‌ కరుణ రత్నే (91 బ్యాటింగ్‌), డిక్వెలా (18 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

మరో అరుదైన మైలురాయి.. పీలేను దాటేసిన రొనాల్డో!!

Story first published: Tuesday, January 5, 2021, 8:59 [IST]
Other articles published on Jan 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+