For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్ గిల్ కాదు.. టీమిండియా వైఫల్యానికి అతనే కారణం: సునీల్ గవాస్కర్

టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా వరుస పరాజయాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే కారణమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌‌పై అతనే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడని, జట్టు పేలవ ప్రదర్శన క్రెడిట్ కూడా అతనిదేనని తెలిపాడు. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ వెనుక కూడా గంభీర్ ఉన్నాడని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఓటమి తప్పించుకునేందుకు పోరాడుతోంది. నాలుగో రోజు ఆట అనంతరం సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్.. తుది జట్టు ఎంపికలో గంభీర్ జోక్యం ఎక్కువైందని ఆరోపించాడు. గంభీర్ దగ్గరకు వెళ్లి శుభ్‌మన్ గిల్ తన జట్టు అని చెప్పగలడా? అని హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు గవాస్కర్ బదులిచ్చాడు.

'మనకు కోచ్‌లు ఎవరూ లేరు. కేవలం మాజీ ఆటగాళ్లు జట్టుకు మేనేజర్లుగా, అసిస్టెంట్ మేజర్లుగా మాత్రమే ఉన్నారు. అలాంటి వారి వద్దకు వెళ్లి మాట్లాడొచ్చు. లచ్ బ్రేక్ తర్వాత సలహాలు కూడా ఇస్తుంటారు. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు మా జట్టుతో మాజీ ఆటగాళ్లు ఎవరూ లేరు. మాక్ వింగ్ కమాండర్ దుర్రానీ, రాజ్ సింగ్ దుంగార్క్‌పూర్ మాత్రమే ఉన్నారు. ఎర్రవల్లి ప్రసన్న కొద్ది రోజులు జట్టుతో కొనసాగారు. ఎవరున్నా తుది జట్టులో కెప్టెన్‌దే తుది నిర్ణయం అవుతుంది. తన టీమ్‌లో కుల్దీప్ ఉండాలా? శార్దూల్ ఉండాలా అనేది కెప్టెన్ చూసుకుంటాడు.

Sunil Gavaskar Hints At Selection Rift In Team India Maybe Shubman Gill Wanted Kuldeep Over Shardul Thakur

జట్టులో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు? అనేది కెప్టెన్ నిర్ణయం. ఏం జరిగినా అతనిదే పూర్తి బాధ్యత. అయితే శార్దూల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని శుభ్‌మన్ గిల్ అనుకోవచ్చు. తుది జట్టు ఎంపికలో కోచ్‌ల జోక్యం ఏ మాత్రం ఉండదు. గంగూలీ భారత క్రికెట్‌లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడు. ధోనీ తనకు కావాల్సిన ఆటగాళ్లను ఎంచుకున్నాడు. కానీ ప్రస్తుతం భారత క్రికెట్ పరిస్థితి గతంలోలా లేదు. బీసీసీఐ నుంచి గంభీర్ తనకు కావాల్సినవన్నీ తీసుకున్నాడు. కేకేఆర్ స్టాఫ్‌ను తనతో పాటు టీమిండియాలోకి తీసుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కూడా గంభీర్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కెప్టెన్ కంటే తన వద్దే ఎక్కువ పవర్ ఉండాలని గంభీర్ అనుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి జట్టు పేలవ ప్రదర్శన క్రెడిట్ కూడా అతనికే దక్కుతుంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, July 27, 2025, 16:46 [IST]
Other articles published on Jul 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+